Advertisementt

డీఎస్సీపై.. వైసీపీ ఏడుపు చూశారా!

Fri 14th Jun 2024 10:26 AM
chandrababu naidu  డీఎస్సీపై.. వైసీపీ ఏడుపు చూశారా!
Did you see YCP crying on DSC? డీఎస్సీపై.. వైసీపీ ఏడుపు చూశారా!
Advertisement

నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పట్టుమని పది గంటలు కూడా కాలేదు.. అప్పుడే వైసీపీ మొదలు పెట్టింది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇక అటు ఇటు ప్రతిపక్షం కానీ వైసీపీ మీడియా, సోషల్ మీడియా నోటికి వచ్చినట్లు మాట్లాడటం షురూ చేసింది. ఎంతలా అంటే.. అబ్బో ఐదేళ్లలో చాలా పొడిచాం.. కానీ బాబు మాత్రం మెగా డీఎస్సీ అని చెప్పి మొదటి రోజే నిరుద్యోగులను నట్టేట ముంచారని తిట్టిపోస్తోంది. అసలు బాబు ఇచ్చిన నోటిఫికేషన్ లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయ్..? మొత్తంగా ఖాళీగా ఉన్న జాబ్స్ ఎన్ని..? వైసీపీ చేస్తున్న విమర్శలు ఏంటి..? టీడీపీ ఇస్తున్న కౌంటర్ ఏంటి..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం వచ్చేయండి..!

ఎవరి బాధ వారిది..!

మెగా డీఎస్సీ అంటే ఒక రేంజిలో ఉద్యోగాలు రిలీజ్ చేస్తారని నిరుద్యోగులు ఎన్నో కలలు కన్నారు. సీన్ కట్ చేస్తే.. 16,347 పోస్టులకే పరిమితం చేసింది బాబు సర్కార్. సీఎం అవ్వగానే తొలి సంతకం అంటూ టీడీపీ చేసిన హడావుడి అంతా ఇంతా కాదని.. తీరా చూస్తే ఉసూరుమనిపించారని వైసీపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. దీనికి తోడు వైసీపీ కార్యకర్తలు, నేతలు ఐతే అబ్బో నోటికి అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్లుగా తిట్టి పోస్తున్న పరిస్థితి. మెగా డీఎస్సీ అంటూ టీడీపీ మెగా మోసం చేసిందని.. 25,000 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ఎన్నికల ప్రచారంలో గప్పాలు కొట్టిన చంద్రబాబు తీరా ఇలా చేశారని విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. అంతే కాదు.. తొలి సంతకంలో 16,347 పోస్టుల్లో 6,100 పోస్టులు వైయస్ జగన్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చినవే అని లెక్కలు తీసి మరి వైసీపీ ఏడుస్తోంది..!

ఎన్ని పోస్టులు..?

ఆంధ్రాలో మొత్తం 50,000 పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 16,000 పోస్టులే ఎందుకు ఇచ్చారని వైసీపీ ప్రశ్నిస్తున్నది. ఇందుకు ఓ రేంజిలో టీడీపీ కౌంటర్ ఇచ్చింది. 50, 000 జాబ్స్ ఖాళీగా ఉన్నాయని తెలిసి కూడా జగన్ ప్రభుత్వం మొన్నటి వరకు ఏం చేసింది..? ఈ ఐదు ఏళ్లలో ఎన్ని పోస్టులు ఇచ్చారో కూడా చెప్పుంటే బాగుండేది అనిపించిందని వైసీపీకి దిమ్మతిరిగేలా టీడీపీ అభిమానులు, కార్యకర్తలు దుమ్ము దులిపేస్తున్నారు. దీనికి కూడా వైసీపీ కార్యకర్తలు గట్టిగానే రియక్ట్ అవుతున్నారు. 6,100 డీఎస్సీ పోస్టులకు వైఎస్ జగన్ 2024 జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేశారని.. ఐతే చంద్రబాబు కోర్టుకు వెళ్ళి పరీక్షలు జరగకుండా అడ్డుకున్నారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు ఇచ్చిన 16,347 పోస్టులలో జగన్ ఇచ్చిన 6,100 పోస్టులు తీసేస్తే 10,247 మాత్రమే అవుతాయి. అసలు దీన్ని మెగా డీఎస్సీ అని ఎలా అంటారో చెప్పండి..? అని టీడీపీని వైసీపీ ప్రశ్నిస్తున్న పరిస్థితి.

సంతకాలు ఇలా..!!

తొలి సంతకం : 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ ఫైల్ మీద చంద్రబాబు సంతకం చేయడం జరిగింది.

రెండో సంతకం : ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు.

మూడో సంతకం : సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు    

నాలుగో సంతకం : ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ.

ఐదో సంతకం : యువతలో నైపుణ్యాలు గుర్తించి వారికి బంగారు భవిష్యత్తు అందించేందుకు స్కిల్ సెన్సస్. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పాలన సాగుతుందని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పునర్వైభవం తీసుకువచ్చేందుకు తొలి అడుగులుపడ్డాయని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు.

Did you see YCP crying on DSC?:

Chandrababu Naidu assumes charge as AP CM, signs on 5 key files

Tags:   CHANDRABABU NAIDU
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement