Advertisementt

వాళ్లందరికీ నాగబాబు వార్నింగ్

Fri 14th Jun 2024 10:22 AM
nagababu  వాళ్లందరికీ నాగబాబు వార్నింగ్
Nagababu warning to all of them వాళ్లందరికీ నాగబాబు వార్నింగ్
Advertisement
Ads by CJ

కూటమి కట్టి టీడీపీ-జనసేన-బీజేపీ లు ఏపీలో అఖండ విజయం సాధించి నారా చంద్రబాబు నాయుడు సీఎం గా, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు స్వీకరించారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నెంబర్ 1 అయితే పవన్ కళ్యాణ్ నెంబర్ 2. ఆ తర్వాతే నారా లోకేష్ అయినా ఎవరైనా. అయితే కూటమి కట్టినప్పటి నుంచి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని మోసం చేస్తాడంటూ వైసీపి నేతలు, వైసీపీ సోషల్ మీడియానే కాదు.. చాలామంది అంటే కూటమికి యాంటీ అయిన వారంతా మాట్లాడుతున్నారు.

కూటమి విజయ సాధించాక కూడా ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారు. అయితే జనసేనకు కానీ, కూటమికి కానీ హాని చెసే రాతలు రాస్తే ఊరుకోమని, అది ఎవ్వరైనా, ముఖ్యంగా వైసీపీ వాళ్ళకి జనసేన నేత నాగబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాడు. సోషల్ మీడియా వేదికగా నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

కూటమి విజయాన్ని ఆసరాగా  తీసుకుని ఎవరైన సరే  కూటమి స్ఫూర్తిని భంగపరిచేలా రాతలు రాస్తే ఊరుకునేది లేదు. ఇప్పటికే ఇలాంటి వార్తలని స్ప్రెడ్ చేసిన వారిపై చర్యలు చేపట్టాం.

జనసేన-టిడిపి-బిజెపి కూటమి స్పిరిట్ ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఖశ్చితంగా తన తగిన కఠిన చర్యలు తీసుకోబడతాయి..

వైసిపి ఇంకా పూర్తిగా చావలేదు, ఇంక బతికే వుంది. ఆ కోరల్లోంచి వచ్చే విషపు రాతలివి. వాటినెవ్వరు పట్టించుకోకండి.

కూటమికి‌ సంబంధించిన  మూడు పార్టీల అధినేతలు సమిష్టి, నిర్మాణాత్మకమైన నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. ఇలాంటి పిచ్చి ప్రయత్నాలని ఎవరు రాసిన, స్ప్రెడ్ చేసిన ఆ సోర్స్ పట్టుకుని వారికి కఠిన శిక్షలు అమలయ్యేలా చేస్తాం...జాగ్రత్త.. అంటూ కాస్త స్ట్రాంగ్ గానే నాగబాబు చేసిన ట్వీట్ పై మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది. 

Nagababu warning to all of them:

Nagababu Serious Warning to Netizens

Tags:   NAGABABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ