అవును.. మీరు వింటున్నది నిజమే..! ఏపీ ఎన్నికల ఫలితాలు చూసాక వైసీపీ నాయకులు, కార్యకర్తలు.. మరీ ముఖ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అమితంగా అభిమానించే, ప్రాణం ఇచ్చే వీరాభిమానులు తీవ్ర విమర్శలు అంతకు మించి సెటైర్లు వేస్తున్న పరిస్థితి. ఎంతలా అంటే మాహాప్రభో ఇకనైనా తమరి పాత రోజులు, విలువలు పక్కన పెట్టండని సూచిస్తున్న పరిస్థితి.
బాబోయ్.. ఈ రేంజిలో..!
నేను ఫోన్ వాడను.. నాకు ఫోన్ లేదు.. నంబరే లేదబ్బా..! ఇవీ ఏపీ ఎన్నికల ముందు ఒక ఇంటర్వ్యూలో వైఎస్ జగన్ చెప్పిన మాటలు. అలా ఫలితాలు వచ్చాయో లేదో.. దేవుడా ఓ మంచి దేవుడా ఇక చాలు దయచేసి ఫోన్ వాడండి అని వైసీపీ నేతలు సూచిస్తున్న పరిస్థితి. ఇందుకే, దీన్నే అలుసుగా తీసుకొని తమరి చుట్టూ ఉన్న కోటరీ ఎన్నికల్లో ఊహించని రీతిలో ఓడించిందని కూడా తిట్టి పోస్తున్నారు. ఇంకొందరు ఐతే.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో ఏనాడు అయినా ఫోన్లో కానీ, నేరుగా పిలిపించి వన్ టూ వన్ ఎప్పుడైనా మాట్లాడారా..? ఇకనైనా మారితే.. అదేనండోయ్ మార్పు మంచిదే అని సొంత మనుషులే సెటైర్లు వేస్తున్న పరిస్థితి.
ఇది చూడండి..!
కొందరు వైసీపీ కార్యకర్తలు, నేతలు ఎన్నికల తర్వాత ఒక్కోక్కరుగా బయటికి వచ్చి మనసులోని మాటను బయట పెడుతున్నారు. ఓటమికి కారణం వాలంటీర్లు అని కొందరు.. మరికొందరు ఐప్యాక్ అని.. ఇంకొందరు ఐతే జగన్ చుట్టూ ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డి, ధనుంజయ్ రెడ్డి ఇలా ఎవరికి తోచింది వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేస్తున్న పరిస్తితి. ఇక ట్విట్టర్ వేదికగా.. అన్న వైఎస్ జగన్ అన్నా ఎటు ఇంట్లో కూర్చున్నావు కనుక Flipkart, Amazonలో చూసి మంచి స్మార్ట్ ఫోన్ కొనుక్కో అని సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మరికొందరు.. తమరికి లోక జ్ఞానం మరీ ఎక్కువ ఐపోయిందని కొంచెం ఫోన్ చూస్తే ఆ జ్ఞానం తగ్గుద్దని చెబుతున్నారు. ఇంకా విలువలు, కొండచిలువలు.. డిబిటీ, టాటా, టీ.. అని అదే పాట పాడుతున్నవ్ ఇది ఎంత వరకు సబబు అని జగన్ రెడ్డిని వైసీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ, సలహాలు.. సూచన చేస్తున్న పరిస్థితి. చూశారుగా ఇదీ వైసీపీలో ప్రస్తుతం నడుస్తున్న హాట్.. హాట్ చర్చ.