కన్నడ స్టార్ హీరో దర్శన్ ప్రేయసి కోసం అభిమానిని నలుగురితో కలిసి హత్య చేయించిన కేసులో ప్రస్తుతం బెంగుళూరు పోలిసుల అదుపులో జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు. హీరో గా కెరీర్ లో మంచి ఫామ్ లో ఉన్న దర్శన్ ప్రియురాలిని బెదిరిస్తున్నడని తన వీరాఅభిమాని అని కూడా చూడకుండా రేణుక చౌదరిని హత్య చేయించడం కలకలం సృష్టించింది.
నటి పవిత్ర గౌడతో దర్శన్ బంధం గురించి కామెంట్లు చేసిన రేణుకా స్వామి అనే వ్యక్తిని కిరాయి గుండాల చేత అత్యంత పాశవికంగా హత్య చేయించిన అభియోగం దర్శన్ మీదుంది. చిత్రదుర్గకు చెందిన రాఘవేంద్రను మరో ముగ్గురిని రేణుక చౌదరి హత్య చేయించడానికి దర్శన్ పురమాయించినట్టు పోలీసులు కనిపెట్టారు.
రేణుక చౌదరిని ఒక షెడ్డుకి తీసుకెళ్లి అక్కడ నాలుగు వ్యక్తులు గోడకేసి కొట్టడం వల్లే ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం జైలులో ఉన్న హీరో దర్శన్ నిద్రాహారాలు మానేసాడని, తనకి ఆకలి కానీ, నిద్ర కానీ రావడం లేదు.. కేవలం ఒక సిగరెట్ ఉంటే ఇవ్వమని పోలీసులని దర్శన్ అడుగుతున్నట్టుగా చెబుతున్నారు. అంత పెద్ద హీరో అయ్యుండి ఎంతకి దిగజారిపోయాడో అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.