వైసీపీ నేతలు 2024 ఎన్నికల్లో గెలిచి తీరుతామంటూ అధికార మదంతో నోటికొచ్చినట్టుగా మట్లాడారు. మంత్రి పదవిలో ఉన్నవారు కూడా జగన్ మెప్పుకోసం పతిపక్షాలని అనరని మాటలన్నారు. పవన్ కళ్యాణ్ ని అసంబ్లీ గేటు కూడా దాటనివ్వమని ఛాలెంజ్ చేసారు. చంద్రబాబు నాయుడిని ముసలోడు ముసలోడు అంటూ సీఎం స్థానంలో ఉన్న జగన్ కూడా అన్నాడు. రోజా, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, వల్లభనేని వంశి, జోగి రమేష్, అంబటి ఇలా చాలామంది నోటికి హద్దు అదుపులేకుండా మాట్లాడేవారు.
ఇప్పుడు 2024 రిజల్ట్ చూసాక ఒక్కొక్కరు మా మంత్రులని నోటి దూల వల్లే ప్రజలు ఓడించారంటూ బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. తాజాగా అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ ఓటమికి మా మంత్రులు నోటి దూల వల్ల కూడా జరిగుండొచ్చు అంటూ మాట్లాడడాం చూసాక వాళ్ళకి వాళ్ళు.. తామేం తప్పు చేసామో అనేది గుర్తొచ్చి ఓపెన్ అవ్వుతున్నారు అంటున్నారు.
మేము చేసిన పొరబాట్లు, మేము చేసిన రకరకాల పనుల వల్లే ఓడిపోయి ఉండొచ్చు. ప్రజలు తీర్పు ఇచ్చారు.. మేము చేసిన పొరబాట్లు సరిదిద్దుకుంటాము, కొత్త ప్రభుత్వానికి కాస్త టైమ్ ఇచ్చాము. తర్వాత ప్రభుత్వ తప్పులు చూపెట్టేందుకు రోడ్ పైకి వస్తామంటూ అనిల్ కుమార్ మీడియా ముందు చెప్పుకొచ్చాడు.
పవన్ కళ్యాణ్ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటామని అన్నారు.. ఇప్పుడేం చెయ్యబోతున్నారు అని మీడియా అడిగితే.. అది ఛాలెంజ్ అండి.. అంతేకాని అది స్టేట్మెంట్ కాదు.. రాజకీయాలంటే ఇప్పుడు గెలిస్తే మళ్లి ఎన్నికలొస్తాయి.. ఆతర్వాత ఎవరు గెలుస్తారో చెప్పలేం అంటూ తపించుకున్నాడు.
దానితో జనసైనికులు అనిల్ కుమార్ యాదవ్ ని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. మాట మీద నిలబడని వాడివి నువ్వో రాజకీయ నాయకుడివా అంటూ ఎద్దేవా చేస్తున్నారు.