బ్యూటిఫుల్ గర్ల్ రాశి ఖన్నా ఎక్కువగా గ్లామర్ షో చెయ్యడానికే ఇష్టపడుతుంది. ఏ సినిమాలో అయినా రాశి ఖన్నా అందాలు ఆరబొయ్యకుండా లేదు. ఎక్కువగా గ్లామర్ పాత్రల్లోనే కనిపించే ఆమె ఈమధ్యన బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఆ గ్లామర్ షో ని డబుల్ చేసింది.
సోషల్ మీడియాలోనూ అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తుంది. హిందీలో వెబ్ సీరీస్, సినిమాలంటూ బిజీగా మారిపోయిన రాశిఖన్నా కి సౌత్ లో పెద్దగా ప్రాజెక్ట్స్ లేని సమయంలో ఆమె కి టాలీవుడ్ యంగ్ హీరోలు అవకాశాలు ఇస్తున్నారు. సౌత్ లో అమ్మడు కెరీర్ క్లోజ్ అనుకుంటున్న సమయంలో కొత్త కొత్త ఆఫర్స్ ఆమె చెంతకి చెరువవుతున్నాయి.
తాజాగా పోస్ట్ చేసిన ఫొటోస్ లో బ్లాక్ శారీ లో రాశి ఖన్నా గ్లామర్ చూస్తే మతిపోవాల్సిందే. చీర కట్టు ని కూడా ఇంతందంగా కట్టొచ్చా అనేలా రాశి ఖన్నా చీరకట్టింది. గ్లామర్ లోనే వేరే లెవల్ చూపించింది. రాశి ఖన్నా గ్లామర్ ఫోటో షూట్ చూసిన వారంతా ఏమిటి రాశి ఈ ఈ గ్లామర్ రచ్చ అంటూ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.