ఆగష్టు 15 కే పుష్ప ద రూల్ అంటూ మొదటి నుంచి తగ్గేదేలే అని ప్రతి పోస్టర్ లోను, ప్రతి అప్ డేట్ లోను చెప్పుకుంటూ వస్తున్న పుష్ప మేకర్స్.. ఇప్పుడు ఆగస్టు 15 నుంచి పుష్ప ని పోస్ట్ పోన్ చేయబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అల్లు అర్జున్ బర్త్ డే వీడియోస్, పుష్ప రాజ్ సాంగ్, సెకండ్ సింగిల్ అన్ని బాగా వైరల్ అయ్యాయి.
ప్రమోషన్స్ మొదలు పెట్టేసారు.. సినిమా కూడా పక్కాగా ఆగష్టు 15 కే వస్తుంది అని అభిమానులు కూడా ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు పుష్ప అనుకున్న సమయానికి వచ్చే ఛాన్స్ లేదు, ఆగష్టు నుంచి షిఫ్ట్ అయ్యే అవకాశం లేకపోలేదనే న్యూస్ అల్లు అభిమానులని ఆందోళనకు గురి చేస్తుంది. పుష్ప ద రూల్ షూటింగ్ ఇంకా ఓ కొలిక్కి రాలేదు.
మరో రెండు నెలలపాటు నిర్విరామంగా షూటింగ్ చేస్తే కానీ.. మొత్తం పూర్తయ్యేలా లేదు. పోస్ట్ ప్రొడక్షన్, పబ్లిసిటీ కార్యక్రమాలకు తగినంత సమయం దొరకదు అని భావించే పుష్ప మేకర్స్ సినిమాని పోస్ట్ పోన్ చేసే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. మరి ఇదే నిజమైతే అల్లు అభిమానులకి నిరాశ తప్పదు.