మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు, భార్యలకు న్యాయం చెయ్యలేనోడు రాష్ట్రానికేం న్యాయం చేస్తాడు అని హేళన చేసిన వారికి, ఎమ్మెల్యేగా అసెంబ్లీ గేటు తాకనీయ బోమన్న వారికి ఓ రేంజ్ సమాధానమిస్తూ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఏకంగా డిప్యూటీ సీఎం గానే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ అడుగుపెట్ట బోతున్నారు. 70 వేలకు పైగా మెజారిటీతో పిఠాపురం నుంచి విజయం సాధించి ప్రతిపక్షాలకి మైండ్ బ్లాంక్ చేసారు. ఇంత మెజారిటీ అంటే మాటలు కాదు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవరంటూ వైసీపీ నేతలు నానా రచ్చ చేశారు. అలాంటివారికి అద్భుతమైన సమాధానమిచ్చారు.
మరి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ తో అంత ఈజీ కాదు. అంటే అధికారం గురించి కాదనుకోండి.. ఆయనతో సినిమాలు చేస్తున్న దర్శకనిర్మాతలకి. గెలిచి ఎమ్యెల్యేగా ఉంటే ఆయనతో సినిమాలు చేసే వారు రిలాక్స్ అయ్యేవారు. కానీ ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం. సీఎం తర్వాత సీఎం. అలాంటి పవన్ కళ్యాణ్ తో షూటింగ్స్ చెయ్యగలరా.. పవన్ దయ తలిస్తే తప్ప వారు మిగతా షూటింగ్ పూర్తి చెయ్యలేరు.
మూడు భారీ సినిమాలు సెట్స్ మీదున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్, OG, హరి హరవీరమల్లు చిత్రాల షూటింగ్స్ సెట్స్ మీదున్నాయి. మరి పవన్ కళ్యాణ్ కాస్త సమయం కేటాయించి ఇవి పూర్తి చేస్తే దర్శకనిర్మాతలు సేఫ్ అవుతారు.
అసలే పవన పవర్ విషయంలో చాలా కసిగా కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడే రాష్ట్రాన్ని ఓ కొలిక్కి తెచ్చెయ్యాలి, అధికార పక్షం ఎంత మిత్ర పక్షమైనా తప్పుల విషయంలో తలొంచకూడదు గట్టిగా ప్రశ్నించాలనే నిర్ణయంతో ఉన్నారు. మరి పవన్ ఇలాంటి సమయంలో సినిమా షూటింగ్స్ కోసం కదులుతారా.. అందుకే అనేది డిప్యూటీ సీఎం తో అంత ఈజీ కాదు అని.!