Advertisementt

పవన్ కాళ్ళకి లోకేష్ పాదాభివందనం

Thu 13th Jun 2024 01:33 PM
nara lokesh  పవన్ కాళ్ళకి లోకేష్ పాదాభివందనం
Nara Lokesh Touches Pawan Kalyan Feet పవన్ కాళ్ళకి లోకేష్ పాదాభివందనం
Advertisement
Ads by CJ

ఒకప్పుడు పప్పు పప్పు అని వెక్కిరించిన వారే ఇప్పుడు గొప్ప గొప్ప అంటూ నారా లోకేష్ ని పొగడడం.. అది చూసి టీడీపీ కార్యకర్తలు, ముఖ్యంగా లోకేష్ ని అభిమానించేవాళ్ళు పొంగిపోవడం కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో చూస్తున్నారు. ఎన్నో అవమానాలు, మరెన్నో సమస్యలని దాటుకుంటూ తనని తాను మలుచుకుంటూ నారా లోకేష్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. 

యువగళం పాదయాత్ర తో తనపై ఉన్న అపనమ్మకాన్ని చెరిపేసి.. ప్రజలు  మధ్యలో తిరిగిన ఈ యూత్ లీడర్.. తండ్రి చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కూడా కుంగిపోకుండా తండ్రి ని బయటికి తెచ్చేందుకు కష్టపడ్డాడు. అదే సమయంలో చెయ్యందించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని అన్నలా భావించాడు.. భావిస్తున్నాడు. 2024 ఎన్నికల్లో ఎలాంటి ఈగోలు పెట్టుకోకుండా పవన్ తో కలిసి పని చేసాడు. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయాన్ని కైవసం చేసుకున్నాడు. గెలుపు వరించింది కదా అని గర్వం నెత్తికెక్కించుకోలేదు. 

బుధవారం చంద్రబాబు సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసాక.. నారా లోకేష్ మంత్రిగా ప్రమాణం చేసాడు. ఆ తర్వాత తండ్రి కాళ్ళకి మొక్కిన లోకేష్ పీఎం మోడీ పాదాలకి నమస్కారం చేయబోగా మోడీ వారించారు. ఆ తర్వాత గవర్నర్ కాళ్ళకి మొక్కిన లోకేష్ అందరికి నమస్కారం చేసి తన సీట్లో కూర్చున్నాడు. 

కానీ అదే స్టేజ్ పై పవన్ కళ్యాణ్ దగ్గరకి వెళ్లి లోకేష్ పవన్ వారిస్తున్నా వినకుండా అన్న స్థానంలో ఉన్న ఆయన కాళ్ళు మొక్కిన అంటే పాదాభివందనం చేసిన వీడియో కాస్త లేట్ గా ఈ రోజు వైరల్ గా మారింది. ఆ వీడియో చూస్తే పవన్-లోకేష్ నిజంగా రక్తం పంచుకుపుట్టిన అన్నదమ్ములు అనిపించేలా ఉందా వీడియో. 

ఆ వీడియో ఈరోజు వైరల్ అవ్వగానే లోకేష్ ని పొగడకుండా ఉండలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు, లోకేష్ లు ఇస్తున్న సముచిత స్థానానికి జనసైనికులు కూడా ఫుల్ హ్యాపీ గా కనబడుతున్నారు. మరికొందరు అరరే ఈ వీడియో ఎలా మిస్ అయ్యామంటూ దానిని స్ప్రెడ్ చేస్తున్నారు. 

Nara Lokesh Touches Pawan Kalyan Feet :

Nara Lokesh Touches Pawan Kalyan Feet on Stage of Chnadrababu Oath Ceremony

Tags:   NARA LOKESH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ