బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులని తికమక పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించిన నటి హేమ.. గత వారం అరెస్ట్ అయ్యింది. బర్త్ డే పార్టీలో డ్రగ్స్ తీసుకుని టెస్ట్ ల్లో దొరికిన వ్యవహారంలో కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. నేనే పార్టీలో పాల్గొనలేదు, నేను ఫామ్ హౌస్ లో ఛిల్ అవుతున్నాను అని ఒకసారి, విచారణకి పిలిస్తే.. వైరల్ ఫీవర్ అని మరోసారి హేమ డ్రామాలాడింది.
రెండుసార్లు నోటీసులు వచ్చినా హేమ తప్పించుకోవడానికి ట్రై చేసింది. మూడోసారి పోలీస్ ల చేతికి చిక్కింది. బెంగుళూరు పోలీసులు స్వయంగా రంగంలోకి దిగి ఆమెని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వైద్య టెస్ట్ ల కోసం హేమ మళ్లీ బురఖా నాటకానికి తెర లేపింది.
ఇక ఈ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జైల్లో ఉన్న హేమ కి బుధవారం బెయిల్ లభించింది. ఈ కేసు విచారణలో హేమ తరుపున న్యాయవాది కోర్టులో హేమ దగ్గర ఎలాంటి డ్రగ్స్ లభ్యం కాలేదని వాధించడంతో కోర్టు హేమకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.