కొన్నాళ్లుగా సక్సెస్ కోసం పరితపిస్తున్న సుధీర్ బాబు.. వరస వైఫల్యాలతో ఇబ్బంది పడినా.. వరసగా సినిమాలు చెయ్యడం మాత్రం ఆపడం లేదు. మీడియం రేంజ్ హీరోగా ఎదిగిన సుధీర్ బాబు.. కొన్నిసార్లు స్ట్రయిట్ కథలు, మరికొన్నిసార్లు రీమేక్స్ ని నమ్ముకుంటున్నాడు. కానీ టైమ్ అతనికి బొత్తిగా కలిసి రావడం లేదు.
ప్రస్తుతం సమ్మర్ వెకేషన్స్ అయ్యిపోయాయి. సమ్మర్ లో విడుదలైన సినిమాలు ప్రేక్షకులని ఆకట్టుకోవడాంలో విఫలమయ్యాయి. గత వారం విడుదలైన సినిమాల్లో శర్వా మనమే పర్లేదు అనిపించినా సత్యభామ.. ఇంకా కొన్ని చిన్న సినిమాలు అస్సలు వార్తల్లో లేకుండా పోయాయి. మరి ఈ వారం రాబోతున్న సుధీర్ బాబు హరోం హర, విజయ్ సేతుపతి మహారాజ, యేవం, మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాల్లో సుధీర్ బాబు హరోం హర పై కాస్త క్రేజ్ కనిపిస్తుంది.
ప్రమోషన్ పరంగా ఈ సినిమా ప్రేక్షకులకి రీచ్ అవుతుంది. మరోపక్క ఈ సినిమాకి కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చినా చాలు మొదటి వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ అందుకుంటుంది. కారణం లాంగ్ వీకెండ్ హరోం హరకి కలిసి రాబోతుంది. శనిఆదివారాలే కాకుండా సోమవారం బక్రీద్ హాలిడే కూడా కలిసి రావడం ప్లస్ అవుతుంది.
సినిమాకి ఏ మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా చాలు ప్రేక్షకులు థియేటర్స్ కి కదులుతారు. మరి సుధీర్ బాబు హరోం హారలో ఎంత సరుకు ఉందొ అనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. సుధీర్ బాబు కి ఈ సినిమా హిట్ అవసరం కూడా..!