అఖిల్ అక్కినేని నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఎడతెగని సస్పెన్స్ నడుస్తూనే ఉంది. ఏజెంట్ డిజ్ పాయింట్ తర్వాత అఖిల్ కొత్త సినిమా విషయంలో అభిమానులని తెగ వెయిట్ చేయిస్తున్నాడు. అటు ఏజెంట్ లుక్ నే అఖిల్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. ఈ మద్యన అఖిల్ కొత్త ప్రాజెక్ట్ అనౌన్సమెంట్ అనిల్ కుమార్ దర్శకత్వంలో రాబోతుంది అని ప్రచారం జరిగింది.
కానీ ఇంతవరకు ఆ కబురు రాలేదు. అక్కినేని ఫ్యాన్స్ పదే పదే డిజ్ పాయింట్ అవడం చూస్తున్నాం. తాజాగా అఖిల్ ఎయిర్ పోర్ట్ లో కారు దిగుతూ కనిపించాడు. అఖిల్ షాకింగ్ లుక్ లో కనిపించి అందరిని సర్ప్రైజ్ చేసాడు. గుబురు గడ్డం, పొడవాటి జుట్టు తో సూపర్ స్టైలిష్ గా కనిపించాడు.
అఖిల్ లేటెస్ట్ మేకోవర్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకోవడం అటుంచి షాకవుతున్నారు. అఖిల్ ఈ లుక్ దేని కోసం రెడీ చేస్తున్నాడు, ఈ మేకోవర్ ఎందుకోసమే అర్ధం కాక కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొంతమంది మాత్రం కచ్చితంగా తన నెక్స్ట్ మూవీ కోసం అఖిల్ ఇలాంటి మేకోవర్ లోకి మారాడని చెబుతున్నారు. మరి అఖిల్ ఈ విషయం ఎప్పుడు తెలుస్తాడో చూడాలి.