నిన్న బుధవారం చంద్రబాబు సీఎం గా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మెగాస్టార్ విశిష్ట అతిధిగా హజరవగా.. స్టేజ్ పై పీఎం నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్-చిరంజీవిలని చూసి ఎంత హడావిడి చేసారో.. ఎంత ఆప్యాయత చూపించారో అందరూ చూసారు. మెగా అభిమానులు, పవన్ ఫ్యాన్స్, జనసైనికులు అయితే చెప్పలేనంత ఆనందాన్ని అనుభవించారు.
అయితే నరేంద్ర మోడీ స్టేజ్ పై అన్నదమ్ములతో అంత ఆప్యాయంగా ఉండడం చూసిన మెగాస్టార్ చిరంజీవి.. నిన్న సాయంత్రం సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనయ్యారు. తమ్ముడు డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చెయ్యడం దగ్గర నుంచి మోడీ ఆప్యాయతతో మాట్లాడిన తీరుని వివరిస్తూ ఈ విధంగా పోస్ట్ పెట్టారు.. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, తమ్ముడు పవన్ కళ్యాణ్ తోనూ, నాతోనూ ఈ రోజు వేదిక పైన ప్రత్యేకంగా కలిసి మాట్లాడినప్పుడు, ఎలక్షన్ ఫలితాల తరువాత అద్భుత విజయం సాధించి మొట్టమొదటి సారి పవన్ కళ్యాణ్ ఇంటికొచ్చినప్పటి వీడియోను ఆయన చూసారనీ, అది తనని భావోద్వేగానికి గురిచేసిందని చెప్పారు.
కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి మా అన్నదమ్ముల మధ్య వున్న ప్రేమానుబంధాలని పంచుకున్న ఆ దృశ్యాలు, మన సంస్కృతీ సంప్రదాయాల్ని, కుటుంబ విలువల్ని ప్రతిబింబించాయని, ఆ క్షణాలు ప్రతి ఒక్క అన్నదమ్ములకి ఆదర్శం గా నిలుస్తాయి అనటం నన్ను ఎంతగానో ఆనందపరిచింది. వారి సునిశిత దృష్టికి, నా కృతజ్ఞతలు! 🙏🙏
తమ్ముడి స్వాగతోత్సవం లాగే ఆయనతో
ఈనాటి మా సంభాషణ కూడా కలకాలం
గుర్తు ఉండిపోయే ఓ అపురూప జ్ఞాపకం!! .. అంటూ మెగాస్టార్ చిరు తన ఆనందాన్ని ట్వీట్ తో పంచుకున్నారు.