Advertisementt

దేవర డేట్ మారుతుందా?

Thu 13th Jun 2024 09:55 AM
devara  దేవర డేట్ మారుతుందా?
Will the Devara date change? దేవర డేట్ మారుతుందా?
Advertisement
Ads by CJ

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ దేవర గోవా షెడ్యూల్ ముగించుకుని నిన్ననే హైదరాబాద్ కి వచ్చేసారు. కపుల్ ఆఫ్ డేస్ దేవర షూటింగ్ తో గోవాలో బిజీగా వున్న ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చాడు. గోవాలో ఒక పాట, సినిమాలోని ముఖ్య నటులపై కీలక సన్నివేశాలని కొరటాల శివ తెరకెక్కించారు. ఈ షెడ్యూల్ లో విలన్ పాత్రధారి సైఫ్ అలీ ఖాన్ కూడా పాల్గొన్నారు.

దేవర చిత్రాన్ని అక్టోబర్ 10 కి విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. అయితే ఇప్పుడు కొత్తగా దేవర డేట్ ని మార్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. అక్టోబర్ 10 నుంచి ప్రీ ఫోన్ చేసి సెప్టెంబర్ 27 న విడుదల చెసే ప్లాన్ లో ఉన్నారట. సెప్టెంబర్ 27 నుంచి పవన్ కళ్యాణ్ OG పోస్ట్ పోన్ అవ్వబోతుంది.  

ఆ సెప్టెంబర్ 27 నే దేవర ని పాన్ ఇండియా మార్కెట్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు స్టార్ట్ చేసారు. అంటే ఎన్టీఆర్ దేవర పవన్ కళ్యాణ్ OG డేట్ ని భర్తీ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే దుల్కర్ లక్కీ భాస్కర్ OG డేట్ కి ఖాయం చేసారు నిర్మాత నాగ వంశి. మరి ఎన్టీఆర్ వస్తా అంటే నాగ వంశీ వచ్చే ఛాన్స్ అయితే లేదు. 

Will the Devara date change?:

Devara release date changed

Tags:   DEVARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ