Advertisementt

అల్లు అర్జున్ ని అన్ ఫాలో చేసిన మెగా హీరో

Wed 12th Jun 2024 06:11 PM
sai dharam tej  అల్లు అర్జున్ ని అన్ ఫాలో చేసిన మెగా హీరో
Sai Tej unfollows Allu Arjun and his wife అల్లు అర్జున్ ని అన్ ఫాలో చేసిన మెగా హీరో
Advertisement
Ads by CJ

పైకి చెప్పట్లేదు కానీ మెగా-అల్లు ఫ్యామిలీ మధ్యలో ఎప్పుడు ఏదో ఒక గొడవ హైలెట్ అవుతూనే ఉంటుంది. ఎంతగా హగ్స్ ఇచ్చుకన్నా, ఎన్ని ఫెస్టివల్స్ కలిసి చేసుకున్నా వారి మధ్యన ఎప్పుడు మంట రాజుకుంటుందా అని ఎదురు చూసేవాళ్ళేమో కానీ.. వారిలో వారికి ఈగో అనేది ఎవ్వరికి కనిపించనంత ఉంది అనేది చాలాసార్లు స్పష్టమవుతూనే ఉంది. 

రీసెంట్ గా మెగా ఫ్యామిలీ అంతా పవన్ కళ్యాణ్ వెంట ఉంటే  అల్లు అర్జున్ మాత్రం వైసీపీ నేత వెనుక నిలబడ్డాడు. తన మిత్రుడు కోసం ఓటెయ్యమని అడగడానికి వెళ్లిన అల్లు అర్జున్ ని పవన్ ఫ్యాన్స్ గట్టిగానే టార్గెట్ చేసారు.  అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పవన్ కి కంగ్రాట్స్ చెప్పి ఊరుకోవడం పై చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు,

ఇక ఈరోజు కేసరపల్లిలో పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మెగా ఫ్యామిలి లో చిన్న పెద్దలంతా కదిలారు. అయితే ఆలు అర్జున్ విషయంలో ఓ మెగా హీరో చాలా కోపంగా ఉండడమే కాదు అల్లు అర్జున్ ని ఆయన భార్యని సోషల్ మీడియా హ్యాండిల్ లో అన్ ఫాలో కొట్టాడనే న్యూస్ తెగ వైరల్ అయ్యింది. 

పవన్ కళ్యాణ్ గెలవగానే పిఠాపురం వెళ్లి మావయ్యని హాగ్ చేసుకుని ఎత్తుకుని తిప్పేసిన సాయి ధరమ్ తేజ్.. తర్వాత పవన్ కళ్యాణ్.. మెగాస్టార్ ఇంటికి వెళ్ళినప్పుడు విజిల్స్ వేస్తూ తెగ సందడి చేసాడు. పవన్ ని అల్లు అర్జున్ సపోర్ట్ చెయ్యని కారణంగానే ఇప్పుడు సాయి తేజ్ అల్లు అర్జున్ ని సోషల్ మీడియా ట్విట్టర్ X, ఇన్స్టా లో అన్ ఫాలో చేశాడంటూ మాట్లాడుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. 

Sai Tej unfollows Allu Arjun and his wife:

Sai Dharam Tej Hero shocks Allu Arjun

Tags:   SAI DHARAM TEJ
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ