బాబు కేబినెట్ ఇదే.. అన్నీ ట్విస్ట్ లే!
అవును.. అంచనాలు అన్నీ తారుమారు అయ్యాయి. అదిగో ఫలానా వాళ్లకు చంద్రబాబు మంత్రివర్గంలో పదవులు ఉంటాయని ఎవరినైతే ఊహించామో వారిని అస్సలు అదృష్టం వరించలేదు. ఇంకో అనుకొని విషయం ఏమిటంటే సీనియర్ల ఆశలు నిరాశలు కాగా.. కొత్తగా గెలిచిన 17 మందికి అవకాశం వచ్చింది. ఇక జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఓకే ఒకే ఒక్కరు.. ఇవన్నీ ఒక ఎత్తయితే ముగ్గురు మహిళలకు ఈసారి మంత్రి పదవులు వరించడం ఇది ఊహకు అందని విషయమే.
ఎన్ని.. ఎన్నెన్ని ట్విస్టులో!
నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, వీరితో పాటు మొత్తం 24 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వాస్తవానికి మంత్రులు ఎవరు..? వారి శాఖలు ఏంటి..? అనేది చివరి నిమషం వరకూ ఎవరికి తెలియదు. గత ప్రభుత్వాలు ఎప్పుడూ రివీల్ చేసేవి కావు. కానీ చంద్రబాబు మాత్రం అర్థరాత్రి ఊహించని రీతిలో ట్విస్ట్ ఇచ్చారు. ఇది ఒక్కటే కాదు మంత్రివర్గం విషయంలోనూ అంతకు మించి ట్విస్టులు ఉన్నాయ్. ఎందుకంటే ఇదిగో వీరి పేర్లు పక్కాగా ఉంటాయని అభిమానులు, టీడీపీ శ్రేణులు అనుకున్నాయో వారి పేర్లు అస్సలు లేవు. కేబినెట్ లో ఒకటి కాదు రెండు కాదు 17 మంది కొత్తవారికి అవకాశం అంటే ఇంతకు మించిన ట్విస్ట్.. బాబు ప్లానింగ్ అంచనాలకు అందనిది..!
ఇవీ లెక్కలు..!
చంద్రబాబు మంత్రివర్గంలో సామాజిక సమీకరణలను బట్టి చూస్తే చాలా బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ ఒక్కరినీ నొప్పించకుండా.. అందులోనూ జనసేన, బీజేపీ పార్టీలను సైతం బాధ పెట్టకుండా ఎలాంటి అసంతృప్తి లేకుండా అంటే అస్సలు మామూలు విషయం కానే కాదు. బీసీలు 08, ఎస్సీలు 02, ఎస్టీ 01, ముస్లీం 01, వైశ్యులు 01, కమ్మ 04, కాపు 04, రెడ్డి 03 ఇలా సామజిక వర్గాలు, ప్రాంతాలు, జిల్లాల వారీగా కేటాయింపులు జరిగాయి. నిన్న మొన్నటి వరకూ వినిపించిన, కనిపించిన పేరు ఒక్కటీ లేదు. ఆశావహులు కూటమిలోని నేతలు తమకు మంత్రి వర్గంలో చోటు ఉంటుందో లేదో అని నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూశారు కానీ సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.
మంత్రులు ఎవరు..?
నారా చంద్రబాబు నాయుడు
కొణిదెల పవన్ కళ్యాణ్
కింజరాపు అచ్చెన్నాయుడు
నారా లోకేష్
కొల్లు రవీంద్ర
నాదెండ్ల మనోహర్
పొంగురు నారాయణ
వంగలపూడి అనిత
సత్యకుమార్ యాదవ్
నిమ్మల రామానాయుడు
ఎన్.ఎమ్.డి.ఫరూక్
ఆనం రామనారాయణరెడ్డి
పయ్యావుల కేశవ్
అనగాని సత్యప్రసాద్
కొలుసు పార్థసారధి
డోలా బాలవీరాంజనేయస్వామి
గొట్టిపాటి రవి
కందుల దుర్గేష్
గుమ్మడి సంధ్యారాణి
బీసీ జనార్థన్ రెడ్డి
టీజీ భరత్
ఎస్.సవిత
వాసంశెట్టి సుభాష్
కొండపల్లి శ్రీనివాస్
మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డిలను అదృష్టం వరించింది.