ఒకప్పుడు వైస్ రాజశేఖర్ రెడ్డి మరణంతో ఆగిన గుండెలంటూ ఆ కుటుంబాలని ఓదార్చడానికి ఓదార్పు యాత్ర చెప్పట్టారు జగన్ మోహన్ రెడ్డి. ఆ తర్వాత పాదయాత్ర, పెన్షన్స్ ఏస్తన్నాయి చెప్పడంతో 2019 లో ఏపీకి సీఎం అయ్యారు. సీఎం అయ్యాక రాష్ట్ర అభివృద్ధిని పక్కనపెట్టేసి.. ఓటు బ్యాంకు కాపాడుకునే ప్రయత్నం చేసిన జగన్ కి 2024 ఎన్నికల్లో ఏపీ ప్రజలు కోలుకోలేని షాకిచ్చారు. 11 సీట్లతో సరిపెట్టుకోమని ప్రతిపక్షం కూడా లేకుండా చేసారు.
దానితో జగన్ లో నిరాశ నిస్పృహలతో పాటుగా పార్టీలో ఉన్న కొద్దిమంది ఎక్కడ టీడీపీ, బీజేపీ, జనసేనలో చేరిపోయి తనకి హ్యాండ్ ఇస్తారో అనే టెన్షన్ పట్టుకుంది. దానితో ఓడిపోయిన అందరిని జగన్ కలుస్తూ ఉండడంతో జగన్ దగ్గరికి వచ్చిన వైసీపీ ఓటమి నేతలంతా జగన్ ని ఓదార్చుతున్నారంటూ బ్లూ మీడియా రాసుకుంటుంది. మంత్రులు, ఎమ్యెల్యే లు అంతా ఓడిపోయారు. దానితో జగన్ వారందరిని తన దగ్గరకి పిలిపించుకుని ఓటమికి కారణాలు అడుగుతున్నారు.
కొడాలి నాని, పేర్ని నాని, విడుదల రజిని, బొత్స వీరంతా జగన్ మీటింగ్ కి హాజరై వైసీపీ 2024 ఎన్నికల్లో అంత దారుణంగా ఎందుకు ఓడిపోయిందో జగన్ కి కారణాలు చెబుతున్నారట. మరి ఎప్పుడు మంత్రులు, ఎమ్యెల్యేలని కలవడానికి అప్పోయింట్మెంట్ కూడా ఇవ్వని జగన్ కి ఇప్పుడు ఓడిపోయాక కానీ వాళ్ళ విలువ తెలియలేదు, అందరితో గంటగంటలు చర్చిస్తున్నాడని వైసీపీ నేతలే మాట్లాడుతున్నారు.
ఇక జగన్ కి వైసీపీ అసలెందుకు ఓడిపోయిందో అనే కారణాలతో పాటుగా పనిలో పనిగా వారంతా మేము మీ వెంటే ఉంటామని చెప్పడం, టీడీపీ కూటమి ప్రజలని తప్పుదోవ పట్టిస్తుంది, చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలయ్యే పరిస్థితిలేదు.. సో త్వరలోనే వైసీపీ కష్టాలు తీరుతాయని ఆయా నేతలు జగన్ ని ఓదారుస్తున్నారట.