Advertisementt

హత్య కేసులో అరెస్ట్ అయిన హీరో

Tue 11th Jun 2024 12:44 PM
darshan  హత్య కేసులో అరెస్ట్ అయిన హీరో
A hero arrested in a murder case హత్య కేసులో అరెస్ట్ అయిన హీరో
Advertisement
Ads by CJ

కన్నడ హీరో దర్శన్ గురించి తెలియని వారుండరు. ఈ హీరో ఇప్పుడు ఓ హత్య కేసులో అరెస్ట్ అవడం హాట్ టాపిక్ గా మారింది. జూన్ 9 జరిగిన ఓ హత్య కేసులో హీరో దర్శన్ ని బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేసారు. రెండు రోజుల క్రితం కర్ణాటకలోని సుమనహళీ బ్రిడ్జ్ సమీపంలో గుర్తు తెలియని శవం లభ్యమవగా.. ఆ శవం చిత్రదుర్గకి సంబందించిన రేణుక స్వామిగా పోలీసులు గుర్తించారు. 

అయితే ఈకేసులో దర్శన్ కి సంబందం ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు దర్శన్ ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కన్నడ కొన్నాళ్ల క్రితం నటి పవిత్ర గౌడ్ కి దర్శన్ కి సంబంధం ఉంది అని పుకార్లు షికార్లు చేసాయి. అది పుకారు కాదు దర్శన్ తో తనకి సంబంధం ఉంది అని పవిత్ర సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది. ఆ విషయంలో దర్శన్ భార్య విజయలక్ష్మి పవిత్ర పై విమర్శలు గుప్పించింది. ఈ విషయమంతా మీడియాలో చాలా హైలెట్ అయ్యింది. 

అయితే పవిత్ర గౌడ ని కించపరిచేలా పోస్ట్ లు పెట్టడం, అలాగే మెసేజెస్ పంపించడంలో రేణుక స్వామి ప్రధాన పాత్ర పోషించడం చేసాడు. ఈ విషయంలోనే రేణుక స్వామిని చిత్ర దుర్గం నుంచి బెంగుళూరుకి తీసుకొచ్చి వినయ్ కి చెందిన ప్రోపర్టీలో దాచిపెట్టి అతనిపై నాలుగు దాడి చెయ్యడంతో అతను చనిపోయాడని, ఈ హత్య కేసులో హీరో దర్శన్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. 

ఈ హత్య కేసులో దర్శన్ పాత్ర ఉంది అని, రేణుక స్వామి చనిపోయాడని తెలిసాక మృత దేహాన్ని కల్వర్టులో పడేసినట్లుగా నలువురు నిందితులు పోలిసుల దగ్గర అంగీకరించడంతోనే పోలీసులు దర్శన్ ని అరెస్ట్ చేసారు అని తెలుస్తోంది. 

A hero arrested in a murder case:

Kannada actor Darshan detained in murder case

Tags:   DARSHAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ