మోదీ 3.0లోని కేబినెట్‌లోని మంత్రులకు శాఖలు కేటాయించడం జరిగింది. మునుపటితో పోలిస్తే పెద్దగా మార్పులు చేర్పులు ఏమీ లేవనే చెప్పాలి. ముందుగా అనుకున్నట్టే హోమ్ మంత్రిత్వశాఖ మళ్ళీ అమిత్ షాకే మోదీ కట్టబెట్టారు. ఇక నితిన్ గడ్కరీకి కూడా రోడ్లు జాతీయ రహదారుల శాఖనే ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే కీలక శాఖలు అన్నీ బీజేపీ తన దగ్గరే పెట్టుకుంది అని చెప్పుకోవచ్చు. కాగా జూనియర్లు ఐనప్పటికీ ఈసారి మాత్రం మోదీ కీలక శాఖలనే కేటాయించారు. ఇక హోమ్ షాకు వద్దని ఎన్డీయేలోని మిత్రులైన నారా చంద్రబాబు, నితీష్ కుమార్ ఇతరా పెద్దలు గట్టిగానే పట్టుబట్టి కూర్చున్నారు. ఐనప్పటికీ ఆఖరికి అమిత్ షానే హోమ్ వరించింది.
కీలక శాఖలు ఇలా..?
అమిత్ షా : హోమ్ మంత్రిత్వ శాఖ
రాజ్‌నాథ్ సింగ్ : రక్షణ శాఖ
నితిన్ గడ్కరీ : రోడ్లు, జాతీయ రహదారులు
జేపీ నడ్డా : ఆరోగ్య, సంక్షేమం
నిర్మలా సీతారామన్ : ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు
శివరాజ్ సింగ్ చౌహాన్ : వ్యవసాయం
కుమారస్వామి : భారీ పరిశ్రమలు, ఉక్కు
పీయూష్ గోయల్ : వాణిజ్య, పరిశ్రమలు
ధర్మేంద్ర ప్రధాన్ : విద్య
అశ్వినీ వైష్ణవ్ : రైల్వే, సమాచార, ఐటీ, ఎలక్ట్రానిక్స్
జ్యోతిరాదిత్య సింధియా : కమ్యూనికేషన్స్
గజేంద్రసింగ్ షెకావత్ : పర్యటక, సాంస్కృతికం
అన్నపూర్ణాదేవి : మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి
కిరణ్ రిజిజు : పార్లమెంటరీ, మైనారిటీ వ్యవహారాలు
హర్దీప్ సింగ్ పూరి : పెట్రోలియం, సహజవాయువులు
సిఆర్ పాటిల్ : జల్ శక్తి
తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి ఏంటి..?
కేంద్రంలో తెలుగు రాష్ట్రాల నుంచి 5 మంత్రి పదవులు దక్కగా వారికి శాఖలు కూడా కీలమైనవే దక్కాయి. ఇందులో పౌర విమానయాన శాఖ, హోమ్ సహాయక మంత్రిత్వ శాఖ ఉండటం విశేషం అని చెప్పుకోవచ్చు.
రామ్మోహన్ నాయుడు (టీడీపీ) : కేంద్ర పౌరవిమానయాన శాఖ
పెమ్మసాని చంద్రశేఖర్ (టీడీపీ) : గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయ శాఖ
భూపతిరాజు శ్రీనివాస వర్మ (బీజేపీ) : భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ శాఖ
కిషన్ రెడ్డి (తెలంగాణ) : బొగ్గు, గనుల శాఖ
బండి సంజయ్ (తెలంగాణ) : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఇదిలా ఉంటే గతంలో అనగా 2014 సమయంలో కేంద్ర ప్రభుత్వంలో ఏ శాఖ ఐతే దక్కిందో ఈసారి అదే శాఖ పౌర విమానయాన శాఖ ఏపీకి దక్కడం విశేషం.