Advertisementt

మమ్మల్ని ముంచింది వాళ్ళే: వైసిపి నేత స్వామిదాసు

Mon 10th Jun 2024 04:32 PM
nallagatla swami das  మమ్మల్ని ముంచింది వాళ్ళే:  వైసిపి నేత స్వామిదాసు
Tiruvuru YCP MLA Candidate Nallagatla Swamidas comments on YCP Defeat మమ్మల్ని ముంచింది వాళ్ళే: వైసిపి నేత స్వామిదాసు
Advertisement
Ads by CJ

ఆంధ్రలో జగన్ మోహన్ ప్రభుత్వం ఓటమిపై ఏ రిపోర్ట్స్ కాదు.. స్వయానా వాళ్ళ తాలూకు అంటే వైసీపీ నేతలే తాము ఓడిపోవడానికి గల కారణాలు, జగన్ చేసిన పొరబాట్లే అంటూ మీడియా ముందు ఏకరువు పెట్టడం, వైసీపీ పార్టీ నుంచి ఓడిపోయిన నేతలంతా ఒక్కొక్కరు ఒక్కో స్టయిల్లో వైసీపీ, జగన్ ప్రభుత్వ ఓటమికి గల కారణాలని ఎత్తి చూపుతున్నారు. 

ధర్మవరం వైసీపీ నేత కేతిరెడ్డి అయితే జగన్ దగ్గరకు వైసీపీ నేతలు, ఎమ్యెల్యేలు, మంత్రులు కలవాలంటే అప్పోయింట్మెంట్ కూడా దొరికేది కాదు, రోజుల తరబడి సీఎం పేషీ ముందే ఎదురు చూసేవారు, అదే జగన్ కి ఓటమికి కారణం అన్నాడు. అంతకుముందు మరో వైసీపీ నేత కూడా ఈ రకమైన కామెంట్స్ చేసాడు. మరికొందరు సజ్జల రామకృష్ణ రెడ్డి, ఆయన కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డే జగన్ ఓటమికి కారణమంటున్నారు. 

ఇప్పుడు తాజాగా తిరువూరు నియోజకవర్గం వైసిపి నాయకుల ముఖ్య సమావేశంలో ఎం ఎల్ ఏ అభ్యర్థి గా పోటీ చేసిన నల్లగట్ల స్వామిదాసు.. ఎన్నికల్లో ఆర్ధికంగా దెబ్బతిన్నాం, కొన్ని పొరపాట్లు జరిగాయి. ఐప్యాడ్ టీం మోసం చేసారు. ఆరా మస్తాన్ అడ్డంగా ముంచేశాడు.. అంటూ మీడియా ముందు వైసీపీ ఓటమి ఎందుకు జరిగిందో చెప్పి వాపోయాడు. 

Tiruvuru YCP MLA Candidate Nallagatla Swamidas comments on YCP Defeat:

Tiruvuru YCP Candidate Nallagatla Swami Das

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ