పవన్ కళ్యాణ్ అభిమానులకి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ రాజకీయంగా గెలిచి అభిమానులకి కిక్ ఇచ్చినా తర్వాత వాళ్ళని డిస్పాయింట్ చేయబోతున్నారనే వార్త వారిని కలవరపెడుతుంది. రాజకీయల్లో ఎమ్యెల్యే గా గెలవడంతో తన బాధ్యత పెరిగింది అని చెబుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలని వదిలెయ్యబోతున్నారనే వార్త పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఆందోళన పెంచుతుంది.
పొలిటికల్ గా ఇకపై పవన్ కళ్యాణ్ ఎక్కువ శాతం ప్రజలతో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఎపుడూ సినిమాల్లోకి రావాలనుకోని పవన్ కళ్యాణ్ తనకి రాజకీయాలంటే ఇష్టం, ప్రజల కోసం ఏదైనా చెయ్యాలనే తపనతో కనిపిస్తున్నారు. తాను ఒప్పుకున్న ఉస్తాద్ భగత్ సింగ్, అలాగే హరి హర వీరమల్లు, OG చిత్రాలని త్వరగా ఫినిష్ చెయ్యాలనుకుంటున్నారట. అలాగే కొత్త ప్రాజెక్ట్స్ కి అడ్వాన్స్ లు తీసుకున్న వాటిని తిరిగిచ్చెయ్యాలని.. ఇకపై ఎక్కువ శాతం రాజకీయాల్లోనే ఉండాలనుకుంటున్నారట.
అది విన్న పవన్ ఫ్యాన్స్ చలా ఢీలా పడిపోతున్నారు. పవర్ స్టార్ సినిమాలు మానేస్తే.. తమకి నిద్రపట్టదు.. పవన్ సినిమాలతో పాటుగా రాజకీయాలని కూడా హ్యాండిల్ చెయ్యాలి అని వారు కోరుకుంటున్నారు. మరి పవన్ ఏం చేస్తారో చూడాలి.