నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు నేడు(జూన్ 14). ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్స్ తో దూసుకుపోతున్న బాలకృష్ణ తన జన్మదినం రోజున తనకి మూడుసార్లు విజయాన్ని కట్టబెట్టిన హిందూపురం ప్రజల మద్యన జరుపుకోవాలనుకుంటున్నారు. నేడు హిందూపూర్ లో పర్యటించనున్న బాలకృష్ణ ప్రస్తుతం హిందూపూర్ హనుమాన్ టెంపుల్ లో కనిపించారు.
నామినేషన్ వేసిన గుడిలో బాలయ్య స్పెషల్ పూజలు నిర్వహించారు. సాంప్రదాయ దుస్తున్న పంచె కట్టులో బాలయ్య గుడికి వెళ్లారు. తనని నమ్మి మూడుసార్లు ఎమ్యెల్యే గా గెలిపించిన హిందూపూర్ లో బాలయ్య పర్యటిస్తూ ప్రజలకి కృతజ్ఞతలు తెలపనున్నారు. ఇక బాలయ్య బర్త్ డే రోజున ఆయన నెక్స్ట్ సినిమా అనౌన్సమెంట్ వచ్చేసింది. అది బోయపాటి-బాలకృష్ణ BB 4 ఎనౌన్సమెంట్ ఇచ్చేసారు.
వీరి కాంబోలో ఇప్పటివరకు హ్యాట్రిక్ హిట్స్ ఉండడంతో BB 4పై అంచనాలు మాములుగా లేవు. ఆయన బర్త్ డే సందర్భంగా మేకర్స్ అధికారికంగా పోస్టర్ వదిలారు. అంతేకాకుండా బాబీ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న మూవీ నుంచి కూడా స్పెషల్ ట్రీట్ రాబోతుంది.