అసలేం జరుగుతుంది. థియేటర్స్ లో సినిమాలు విడుదలయ్యాక ఎనిమిది వారాల గ్యాప్ తో ఏ ఓటీటీ నుంచి అయినా ఆ సినిమాలని స్ట్రీమింగ్ చెయ్యాలనే నిబంధనని తుంగలో తొక్కి కొన్నాళ్లుగా నెల రోజుల గ్యాప్ లో థియేట్రికల్ రిలీజ్ లని ఓటీటీ లో స్ట్రీమింగ్ లోకి తెస్తున్నారు. నాని దసరా టైం నుంచి స్టార్ట్ అయ్యి కృష్ణమ్మ వరకు హిట్ అయినా, ప్లాప్ అయినా చాలా సినిమాలు నెల రోజుల వ్యవధిలోనే స్ట్రీమింగ్ అయ్యాయి.
కానీ మే లో విడుదలైన కృష్ణమ్మ చిత్రం విడుదలైన వారంలోపే ఓటీటీలోకి స్ట్రీమింగ్ లోకి వచ్చేసి థియేటర్ ఆడియన్స్ కి షాకిచ్చింది. మే 14 న థియేటర్స్ లో విడుదలైన సత్యదేవ్ కృష్ణమ్మ చిత్రం విడుదలైన వారం తర్వాత తెలంగాణ లోని సింగిల్ స్క్రీన్స్ బంద్ కావడంతో మేకర్స్ వారం తిరిగేలోపు ఓటీటీలో వదిలేసారు. సరే కృష్ణమ్మ పరిస్థితి అది అనుకున్నారు.
కానీ ఇప్పుడు విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా థియేటర్స్ లో విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీలోకి రావడం చూసిన వారు అసలేం జరుగుతుంది. థియేటర్స్ లో విడుదలయ్యాక చాలా తొందరగా ఓటీటీలో విడుదల చేస్తే థియేటర్స్ పరిస్థితి ఏమిటి. ఇలా నిబంధనలు పెట్టుకుని వాటిని నిర్మాతలే పాటించకపోతే ఎలా.. అసలు ఈ పరిస్థితులు ఎందుకు తలెత్తాయి. యంగ్ హీరోలు కంటెంట్ మీద దృష్టి పెట్టకపోతే.. ఇలాంటివే చవి చూడాల్సి వచ్చేలా ఉంది.. మిడిల్ స్టార్స్ నుంచి వచ్చిన సినిమాలు థియేటర్స్ లో చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడకపోవడమేనా అసలు కారణం.
ప్రేక్షకులకు ఎలాంటి కంటెంట్ కావాలి. ఏ జోనర్ సినిమాలని ఇష్టపడతారు. స్టార్ హీరోలైతేనే థియేటర్స్ కి వెళతారా.. ఇదంతా ఆలోచిస్తే మున్ముందు థియేటర్స్ మనుగడ ఎలా ఉండబోతుంది అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.