కుప్పం లో గనక చంద్రబాబు ఓడిపోకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను, అంతేకాదు ఆడి(చంద్రబాబు) బూట్లు కూడా తుడవడానికి నేను సిద్దమే అంటూ కొడాలి నాని జగన్ మంత్రి వర్గంలో ఉన్నప్పుడు అధికార మదంతో చంద్రబాబు ని కించపరుస్తూ చేసిన కామెంట్స్ కి సంబందించిన పాత వీడియోస్ ని ఇప్పుడు నాని ఓడిపోయి నోరు పడిపోయిన సందర్భంలో బయటికి తీసి టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
అంతేకాదు కొడాలి నాని.. ఎప్పుడొస్తున్నావ్ మా చంద్రబాబు బూట్లు తుడవడానికి, రాజకీయ సన్యాసం ఎప్పుడు చేస్తున్నావ్, రాజకీయాల నుంచి తప్పుకో.. లేకుంటే నీ మాటకు అంతో ఇంతో ఉన్న వాల్యూ కూడా పోతుంది అంటూ కొడాలి నాని ని ఉద్దేశించి టీడీపీ కార్యకర్తలు, టీడీపీ అభిమానులు చేస్తున్న కామెంట్స్ చూస్తే నిజంగా కొడాలి ఏమైనా చేసేసుకుంటాడెమో అంటున్నారు నెటిజెన్స్.
అధికారం మదం, అధికారం ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే అవకాశం వచ్చిన వాళ్ళు అస్సలు ఊరుకోరు. అందుకే ఈ ఐదేళ్లు నువ్వు ఏపీలో ఎలా తిరుగుతావో చూస్తామంటూ కొడాలికి అపుడే వార్నింగ్ లు కూడా స్టార్ట్ చేసారు. మరి నిన్నటివరకు రెచ్చిపోయిన కొడాలి ఈరోజు పోలీస్ కేసు పెడతా, వైసీపీ ని నిర్వీర్యం చేస్తామంటే చూస్తూ ఊరుకోము, పోలీస్ కేసులు పెడతాం అంటూ నాని టోన్ మార్చి మాట్లాడుతున్నాడు.