విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మే 31న థియేటర్స్‌లో విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిపై అంచనాలున్నప్పటికీ.. ప్రేక్షకుల్లో అప్పుడు సినిమాలు చూసే మూడ్ లేదు. కారణం ఎలక్షన్ రిజల్ట్ ఫీవర్. జూన్ 4 న ఎలక్షన్ రిజల్ట్ వస్తూ ఉండడంతో అందరూ ఆ మూడ్‌లో ఉన్నారు.
ఇక మే 31న సినిమా విడుదలైంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఎలా ఉండేదో.. ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ టాక్ రావడం విశ్వక్ సేన్‌ని కాస్త నిరాశపరిచింది. అయినప్పటికీ ఫస్ట్ వీకెండ్‌లోనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బ్రేక్ ఈవెన్‌కి దగ్గరయ్యే కలెక్షన్స్‌తో కళకళలాడింది. మేకర్స్ కూడా ఈ ప్రాజెక్ట్ మాకు సేఫ్ అని ప్రకటించారు.
ఇదిలా ఉంటే ఈ చిత్ర ఓటీటీ హక్కులని ఫ్యాన్సీ డీల్‌కు చేజిక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాన్ని జూన్ నెల చివరి వారం వరకు అంటే థియేటర్స్‌లో విడుదలైన నెల వరకు ఓటీటీలో స్ట్రీమింగ్ చేయరు అనుకుంటే.. ఇప్పుడు థియేటర్స్ ఆడియన్స్‌కి సూపర్ కిక్ ఇస్తూ.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి థియేటర్స్‌లో విడుదలైన రెండు వారాల్లోనే అంటే ఈ జూన్ 14నే నెట్‌ఫ్లిక్స్ నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్టుగా ప్రకటించి బిగ్ షాక్ కూడా ఇచ్చారు.