ఈనాడు మీడియా సంస్థల అధినేత రామోజీ రావు అనారోగ్య కారణాల దృష్యా ఈ రోజు శనివారం తెల్లవారు ఝామున తుది శ్వాస విడిచారు. రామోజీ రావు మరణం పట్ల అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. సినీ, రాజకీయ, మీడియా ప్రతినిధులు రామోజీ పార్దీవ దేహాన్ని సందర్శిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు తమ పనులన్నీ ఆపుకుని హుటాహుటిన ఢిల్లీ నుంచి బయలుదేరి ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా రామోజీ రావు భౌతిక కాయానికి నివాళులు అర్పించడానీకి రామోజీ ఫిలిం సిటికి వెళ్ళారు.
సాధారణంగా ఏ ప్రముఖ వ్యక్తి అయినా చనిపోయాక.. ఆయన జ్ఞాపకార్ధం స్మారక చిహ్నాన్ని కుటుంబ సభ్యులో, లేదంటే ప్రభుత్వాలో ఏర్పాటు చెయ్యడం చూస్తూ ఉంటాము. కానీ రామోజీ రావు గారు చావు పుట్టుకలనేవి నిజం. ఎప్పటికైనా మనిషి చావుకి దగ్గరవ్వాల్సిందే. ప్రతి మనిషికీ మరణం ఒక వరం అని నమ్మిన వ్యక్తి.
అందుకే రామోజీరావు జీవించి ఉండగానే సొంతంగా తన స్మారకాన్ని తానే నిర్మించుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన తన కోసం నిర్మించుకున్న స్మారకం ఆయనకు మరణంపై ఉన్న గౌరవాన్ని స్పష్టం చేస్తుంది. బ్రతికుండగానే తన స్మారకాన్ని నిర్మించుకున్న ఏకైక వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో ఈరోజు ఉదయం నుంచి రామోజీ భౌతిక కాయం.. సందర్శించేందుకు ఆయన అభిమానులు, రామోజీ సంస్థల ఉద్యోగులు, సినీ, రాజకీయ ప్రముఖులు బారులు తీరారు.