బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఆ క్రేజ్ ని సాహో తో, సలార్ తో కంటిన్యూ చేస్తున్నారు. సాహో చిత్రాన్ని సౌత్ ప్రేక్షకులు లైట్ తీసుకున్నా నార్త్ ఆడియన్స్ మాత్రం విపరీతంగా ఆదరించారు. అయితే ఇప్పుడు ప్రభాస్ నుంచి రాబోతున్న కల్కి 2898 AD పై కూడా నార్త్ ఆడియన్స్ లో ఎంత క్రేజ్ ఉందొ ముంబై జుహు బీచ్ వద్ద ఉన్న క్రౌడ్ ని చూస్తే అర్ధమవుతుంది.
ముంబై జుహు బీచ్ లో కల్కి 2898 AD బుజ్జి రివీలింగ్ హైదరాబాద్ ఈవెంట్ ని పెద్దపెద్ద స్క్రీన్స్ పెట్టి వెయ్యగా.. అక్కడికి తండోపతండాలుగా ప్రేక్షకులు, ప్రభాస్ ఫ్యాన్స్ తరలిరావడం చూసాక నార్త్ ఆడియన్స్ లో కల్కి బుజ్జి పై ఎంత క్రేజ్ ఉందొ అనిపించకమానదు. చాలా ఎక్కువ క్రౌడ్ బుజ్జి వీడియో ని వీక్షించారు.
ప్రస్తుతం జుహు బీచ్ వద్ద కల్కి బుజ్జి వీడియోస్ ని స్పెషల్ స్క్రీన్స్ లో వీక్షించేందుకు వచ్చిన క్రౌడ్ ని సోషల్ మీడియాలో చూస్తే చూసాక వీరంతా ఎంతగా కల్కి కోసం వెయిట్ చేస్తున్నారో అనిపించకమానదు. మరి జూన్ 27 వరకు నిరీక్షిస్తే చాలు.. ఆ తర్వాత అంతా కల్కి ప్రపంచమే.