ఏ విషయమైనా ముక్కుసూటిగా మట్లాడుతూ ఎక్కువగా కాట్రవర్సీలో కనిపించే హీరోయిన్ తాప్సి.. ఈ మధ్యనే బాయ్ ఫ్రెండ్ స్పెయిన్ బ్యాట్మెంటన్ ప్లేయర్ మథియాస్ తో ఏడడుగులు నడిచింది. ఆమె మాథియస్ బో తో ఎన్నో ఏళ్లుగా డేటింగ్ లో ఉన్నా, అతనితో పెళ్లి పీటలెక్కినా ప్రతి విషయాన్ని సీక్రెట్ గా దాచాలనే చూసింది. ఎమన్నా అంటే మాకు ప్రవేట్ లైఫ్ ఉంటుంది అంటుంది.
అయితే తాను మథియాస్ ని ప్రేమించింది లవ్ యట్ ఫస్ట్ సైట్ తో కాదు. మాథియస్ బో కన్నా ముందు నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ నాకు నచ్చిన వాడు, నా భావాలకు దగ్గరైనవాడు మాత్రం మాథియస్ మాత్రమే. మాథియస్ పరిచయం అయ్యాక, తనతో మాట్లాడడం మొదలెట్టాక నా అభిరుచులకు దగ్గరగా ఉన్న వ్యక్తి దొరికాడు అనుకున్నాను.
మథియాస్ ది నాది లవ్ మ్యారేజ్. అతనితో ప్రేమలో పడకముందు మథియాస్ కి కొన్ని అగ్ని పరీక్షలు పెట్టాను. అన్నిటిలో మాథియస్ గెలిచాడు. నాకు ప్లేయర్స్ అంటే ఇష్టం. వాళ్ళు దేశం కోసం ఆడుతారు. నాకు మాథియస్ కి మధ్యలో ఉన్న ప్రేమ ఒక నెలలో పుట్టినది కాదు. మా మధ్యన ఉన్న ప్రేమ నిజమైనదా.. కదా.. అనేది తెలుసుకోవడానికి అతనికి చాలా పరీక్షలు పెట్టాను.
నాకు అంతకుముందు పరిచయం ఉన్న బాయ్ ఫ్రెండ్స్ వేరు, మథియాస్ బో వేరు. ఆ వ్యక్తులతో మాథియస్ ని పోల్చలేను, భద్రత, పరిణితి అన్నిటిలో అతనికి ఎవరు సాటిరారు అంటూ భర్త ని తాప్సి తెగ పొగిడేసింది.