Advertisementt

సినిమాల్లోకి రావాలనుకోలేదు: ప్రియాంక

Sat 08th Jun 2024 04:37 PM
priyanka arul mohan  సినిమాల్లోకి రావాలనుకోలేదు: ప్రియాంక
Priyanka Mohan is not coming in movies సినిమాల్లోకి రావాలనుకోలేదు: ప్రియాంక
Advertisement
Ads by CJ

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ - సుజిత్ కాంబోలో తెరకెక్కుతున్న OG చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసి ఒక్కసారిగా పాపులర్ అయిన ప్రియాంకా అరుళ్ మోహన్ పై ఏ న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ గా మారిపోతుంది. సోషల్ మీడియాలో ప్రియాంక మోహన్ వదిలే ఫోటో షూట్స్ ని పవన్ ఫ్యాన్స్ తెగ స్ప్రెడ్ చేస్తూ హడావిడి చెయ్యడం కూడా ఆమెకి క్రేజ్ పెరిగేలా చేసింది. 

గ్యాంగ్ లీడర్ తో సో సో గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ప్రియాంక మోహన్ కి తమిళ్లో మంచి మంచి అవకాశాలొచ్చాయి. అయితే ప్రియాంక కి బ్రేకిచ్చే అవకాశం మాత్రం తమిళనాట తగల్లేదు. పవన్ కళ్యాణ్ పక్కన ఛాన్స్ కొట్టేసాక మరింత క్రేజీగా మారింది. అయితే ప్రియాంక మోహన్ సినిమాల్లోకి రాకపోయుంటే ఏం చేసేదో తెలుసా.. 

తన స్టడీయస్ పూర్తయ్యాక ఓ మంచి జాబ్ చూసుకుని ఏదైనా కంపెనీలో చేరాలనుకుందట. అసలు ఎప్పుడు సినిమాల్లోకి రావాలనుకోలేదట. సినిమాల కోసం ఎలాంటి ప్రయత్నమూ చేయలేదట. ఒకవేళ సినిమాల్లోకి రాకపోయుంటే తాను ఈపాటికి ఏదైనా కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఉండిపోయేదాన్ని అని చెబుతుంది. ఇక తనకిష్టమైన హీరో రజినీకాంత్ అని.. ఆయన సింప్లిసిటీ, అలాగే నటన తనకి ఎంతో నచ్చుతుంది అంటూ చెప్పుకొచ్చింది. 

Priyanka Mohan is not coming in movies:

Priyanka Arul Mohan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ