ఏపీ కాంగ్రెస్ నేతలు రాజశేఖర్ బిడ్డ షర్మిల ని వదిలే ప్రసక్తే లేదు అంటున్నారు. తెలంగాణాలో YSRTP పార్టీ పెట్టి దానిని కాంగ్రెస్ లో కలిపేసి.. ఆ తర్వాత ఆంధ్ర కి వచ్చి కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఏపీ ఎన్నికల్లో పోటీ చేసింది. షర్మిల ఈ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇస్తామని చాలామందిని మోసం చేసినట్లుగా ఏపీ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇక తెలంగాణాలో గత ఎన్నికల సమయంలో YSRTP అధికార ప్రతినిధి ద్వారా మరియు కోర్ కమిటీ సభ్యుని ద్వారా ఒక్కో అభ్యర్థి నుండి 25 లక్షల నుండి 40 లక్షల వరకు దండుకుని చేతులెత్తేసి ఏపీకి పారిపోయిన షర్మిలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. అంటూ తెలంగాణ షర్మిల పార్టీ నేతలు షర్మిలపై ఫైర్ అవుతున్నారు.
అంతేకాకుండా హైదరాబాద్ లోటస్ పాండ్ లో నివాసం ఉంటున్న ఏపీ PCC ప్రెసిడెంట్ షర్మిల ఇంటిని ముట్టడించేందుకు షర్మిల చేతిలో ఆర్థికంగా నష్టపోయి, మరియు రాజకీయంగా, భవిష్యత్తు కోల్పోయిన తెలంగాణ YSRTP నేతలంతా సంయత్తమవుతున్నట్టుగా సమాచారం.