Advertisementt

ఓటమి బాధ నుంచి తేరుకోకముందే..

Fri 07th Jun 2024 10:01 PM
ycp  ఓటమి బాధ నుంచి తేరుకోకముందే..
Before recovering from the pain of defeat.. ఓటమి బాధ నుంచి తేరుకోకముందే..
Advertisement
Ads by CJ

వైస్ జగన్ మోహన్ రెడ్డి ఓటమి బాధ నుంచి ఇంకా తేరుకోనేలేదు. వైసీపీ 2024 ఎన్నికల్లో ఇంత దారుణంగా ఓడిపోతుంది అని జగన్ మాత్రమే కాదు, ఎవ్వరూ ఊహించనైనను లేదు. 11 సీట్లుమాత్రమే గెలుచుకుని ప్రతి పక్ష హోదాని కూడా కోల్పోవడం జీర్ణించుకోలేని విషయం. ఇంకా ఓటమి కారణాలపై జగన్ సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నాడు. 

మరోపక్క వైసీపీ నేతలు తామెందుకు ఓడిపోయామో అనేది సెల్ఫీ వీడియోస్ ద్వారా ఏకరువు పెడుతున్నారు. అయితే ఇప్పుడు ఓటమి భారం నుంచి కోలుకోక ముందే వైసీపీ లో గెలిచిన 11 మందిలో కొంతమంది నేతలు కూటమి వైపు చూస్తున్నారనే విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైసీపీ నుంచి 11 మంది ఎమ్యెల్యేలు గెలిచారు. 

ఆ 11 మందిలో కొందరు అధికార పార్టీలోకి జంప్ చేసే అవకాశం ఉంది అని ఫ్లాష్ న్యూస్ లు చక్కర్లు కొడుతున్నాయి. జగన్ కు అండగా నిలిచిన నేతలు సైతం వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరుకునే అవకాశం ఉంది అంటున్నారు. దానితో జగన్ శిబిరంలో అశాంతి మొదలయ్యింది. ఉన్న 11 మందిని రక్షించుకోలేకపోతే మరింతగా పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అని జగన్ మరింతగా కంగారు పడుతున్నట్లుగా టాక్. 

Before recovering from the pain of defeat..:

YCP MLAs looking towards TDP

Tags:   YCP
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ