Advertisementt

ఆలీ సైలెంట్ అవడమే కరెక్ట్

Fri 07th Jun 2024 07:12 PM
ali  ఆలీ సైలెంట్ అవడమే కరెక్ట్
Ali is right to be silent ఆలీ సైలెంట్ అవడమే కరెక్ట్
Advertisement
Ads by CJ

సినీ నటుడు ఆలీ సినిమాలే కాకుండా గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ కోసం పని చేసారు. జగన్ మోహన్ రెడ్డి కోసం తనకిష్టమైన స్నేహితుడు పవన్ కళ్యాణ్ ని కూడా ఆలీ వదిలేసుకున్నాడు. ఇక వైసీపీ ప్రభుత్వం చివరి దశకు వస్తున్న సమయంలో ఆలీకి ఎలక్ట్రానిక్  సలహాదారు పదవి ఇచ్చారు జగన్. దానితో అలీ సంబరపడిపోయి ఈ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు. 

కానీ జగన్ మాత్రం ఆలీని పక్కన పెట్టేసి ఎమ్యెల్యే సీటు కానీ, ఎంపీ సీటు కానీ ఇవ్వకుండా నిరాశపరచడంతో ఆలీ వైసీపీ తరపున 2024 ఎన్నికల్లో పని చెయ్యలేదు. ప్రచార కమిటీలో కూడా ఆలీని జగన్ పక్కన పెట్టెయ్యడంపై ఆలీ అలిగాడంటూ గుసగుసలాడుకున్నారు. ఆలీ కూడా వైసీపీ పార్టీకి, జగన్ కి దూరంగా సైలెంట్ గా ఉండిపోయాడు. 

అయితే ఆలీ అలా సైలెంట్ గా ఉండడమే కరెక్ట్ అంటున్నారు ఆయన అభిమానులు. అదే గనక వైసీపీ కి ప్రచారం చేసుంటే.. ఇప్పుడు వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఆలీ పరిస్థితి మరింత ఘోరంగా తయారయ్యేది. ఎలాంటి హడావిడి లేకుండా తన సినిమా షూటింగ్స్ తో అలీ వైసీపీ ని పక్కనపెట్టడం మంచిదయ్యింది అంటూ మాట్లాడుకుంటున్నారు. లేదంటే వైసీపీ పరాజయంతో ఆలీ మరింతగా బాధపడాల్సి వచ్చేది అంటున్నారు 

Ali is right to be silent:

Why Ali Is Not Seen In YCP Campaign Activities?

Tags:   ALI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ