వైసీపీ ప్రభుత్వంలో బూతు మంత్రిగా, గుట్కా మంత్రిగా పేరు తెచ్చుకున్న కొడాలి నాని.. అధికార మదంతో ఎంతగా రెచ్చిపోయాడో అనేది ఇప్పటికి యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఆయన వీడియోస్ తండోపతండాలు వస్తూనే ఉంటాయి. వైసీపీ అధికారంలో ఉంది, జగన్ ముఖ్యమంత్రి ఇక మనల్ని పీకేదేవరు అన్నట్టుగా కొడాలి నాని ప్రతి పక్షమైన టీడీపీ పై నోరు పారేసుకునేవాడు.
అవసరం ఉన్నా లేకపోయినా కొడాలి నాని చంద్రబాబు, నారా లోకేష్ తో పాటుగా భువనేశ్వరిని కూడా వదలకుండా నీచంగా మట్లాడేవాడు. తన K కన్వెన్షన్ లోకి తాను బ్రతికుండగా చంద్రబాబు అడుగుపెట్టలేడంటూ ఛాలెంజ్ చేసేవాడు. గుడివాడ నా అడ్డా, నా ముందు మీరెంత అన్నట్టుగా కొడాలి నాని బిహేవియర్ ఉండేది. కొడాలి నానిని చాలామంది బూతు మంత్రిగా అభివర్ణించేవారు.
మరిప్పుడు కొడాలి నాని అడ్డాలోనే దారుణాతి దారుణంగా ఓడిపోయాడు. కొడాలి నాని ఓడిపోవడం నానికి ఎలా ఉందొ తెలియదు కానీ.. మిగతావారంతా చాలా పెద్ద షాకయ్యారు. ఓటు బ్యాంకు బలంగా ఉన్న నాని ఓటమి చూసి చాలామంది నోరు అదుపులో ఇకపోతే ప్రజలే ఇలా బుద్ది చెబుతారంటూ మాట్లాడుకుంటున్నారు.
మరి ఇప్పటివరకు రెచ్చిపోయి, అధికారంలో నుంచి దిగిన కొడాలి కి ఇచ్చిపడేసేందుకు తెలుగు దేశం కార్యకర్తలు రెడీ ఆయ్యారు. గుడివాడలోని నాని నివాసంపై కొంతమంది టీడీపీ యువకులు కోడిగుడ్లు, రాళ్ళు విసురుతూ అలజడి సృష్టించారు. ఇక ఈ ఘటనని ఆపేందుకు పోలీసులు హుటాహుటిన నాని ఇంటికి చేరుకోవడంతో ఆ యువకులు కాస్త వెనక్కి తగ్గారు. లేదంటే కొడాలి నాని కి ఈ రోజు చుక్కలు కనిపించేవి అంటున్నారు. మరి కర్మ రిటర్న్స్ అంటే ఇదేనేమో.. అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.