నోరుంది కదా అని ఏది బడితే అది మాట్లాడితే.. ఇప్పుడు వైసీపీ మంత్రులు, ఎమ్యెల్యేలకి ఏ గతి పట్టిందో అదే గతి చాలామందికి పట్టేలా కనిపిస్తుంది వ్యవహారం. జగన్ కి, వైసీపీకి భజన చెయ్యొచ్చు, అలాగని అన్నం పెట్టిన వారిని నిందించకూడదు. సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వెళ్లి తన తోటి నటులనే నీచంగా విమర్శిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలమా..?
ఇప్పుడు పోసాని విషయంలో ఏం జరగబోతుంది. పోసాని కృష్ణమురళికి ఇకపై సినిమా ఇంస్ట్రీలో మనుగడ ఉంటుందా? మంచి అవకాశాలు వస్తాయా.. జగన్ పార్టీలో చేరి జగన్ కి జై కొట్టి జనసేన అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ ని విమర్శించే విషయంలో కాస్త అతిగానే మాట్లాడిన పోసానికి ఇకపై ఇండస్ట్రీ ప్రముఖులు తమ సినిమాల్లో అవకాశాలు ఇచ్చే ఛాన్స్ ఉంటుందా? అనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న.
పవన్ కళ్యాణ్ ని, బాలక్రిష్ణని, చంద్రబాబు ని నోటి కోచ్చినట్టుగా మాట్లాడిన పోసాని కృష్ణమురళికి వైసీపీ దారుణ పరాజయం పాలవడం మాత్రం నెత్తిన పిడుగు పడినట్లుగా అయ్యింది. వైసీపీ గెలుస్తుంది అని కలలు కని వైసీపీ పదవిని అనుభవిస్తూ నోటికి పని చెప్పాడు. కానీ ఇప్పుడు వైసీపీ ఓటమి పాలైంది. ఇక పోసాని పనైపోయింది అంటూ సినిమా ఇండస్ట్రీ పీపుల్ మాట్లాడుకుంటున్నారు.