బాలీవుడ్ లోనే కాదు.. సౌత్ లోను క్రేజీ హీరోయిన్ గా మారిన కియారా అద్వానీ.. నాజూగ్గా, అందంగా, చాలా అంటే చాలా గ్లామర్ గా కనిపిస్తుంది. ఎక్కువగా మోడ్రెన్ అవుట్ ఫిట్స్ కి ప్రాధాన్యత నిచ్చే కియారా అద్వానీ ఈమధ్యన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో వైట్ గౌన్ లో మెరిసిపోయింది అమ్మడు అందాలు ఆ వైట్ అవుట్ ఫిట్ లో బాగా ఎక్స్ పోజ్ అయ్యాయి.
ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ లో నటిస్తున కియారా అద్వానీ, అటు వార్ 2 లో ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. అదలా ఉంటే కియారా అద్వానీ డైట్ ప్లాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హీరోయిన్స్ అంటే సగం సగమే తింటూ పొట్ట ఎండబెట్టుకుని డైటింగ్ అంటూ.. మాడిపోతారు. అలాగే వరౌట్స్ అంటూ చమటలు చిందిస్తారు.
అయితే కియారా అద్వానీ మాత్రం తినేయ్యాలనిపించింది కదా అని అతిగా తినదట. అలాగే తినకూడదు అనుకుని ఉపవాసాలు చెయ్యదట. మసాలా ఫుడ్స్ కి మాత్రం ఎప్పుడు దూరంగానే ఉంటుందట.
అంతేకాకుండా ఎంత త్వరగా అయితే బరువు పెరుగుతానో, అంతే త్వరగా తగ్గగలను. నాకు చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్ ,డాన్స్ చెయ్యడమంటే ఇష్టం. గ్లామర్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యాక వాటిని నా దినచర్యలో భాగంగా చేసుకున్నాను. జిమ్, డాన్స్, స్విమ్మింగ్ ఏదైనా ఇష్టంగా చేస్తే కష్టమనిపించదు అంటూ కియారా తన గ్లామర్ సీక్రెట్ బయటపెట్టింది.