నేషనల్ క్రష్ నుంచి పాన్ ఇండియా హీరోయిన్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న రష్మిక మందన్న సౌత్ లోనే కాదు నార్త్ లోను పాపులర్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం ముంబై నుంచి చెన్నై, హైదరాబాద్ అన్నట్టుగా రష్మిక బిజీ బిజీగా గడిపేస్తుంది. ఇక మధ్య మధ్యలో సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ తో హడావిడి.
ఇప్పుడు కూడా క్రీమ్ కలర్ బ్లేజర్ లో రష్మిక లుక్స్ సూపర్బ్ కాదు గ్లామర్ అనేలా ఉన్నాయి. ఫిట్ నెస్ కి మారు పేరు రష్మిక మందన్న అనేలా ఆమె నాజూకు తనం కనిపించింది. అందానికి అందం, నటనకు నటన, గ్లామర్ కి గ్లామర్ తో రష్మిక కెరీర్ లో దూసుకుపోతుంది.
ప్రస్తుతం పుష్ప 2 పాన్ ఇండియా ఫిలిం తో ఆగష్టు 15 కి పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు వచ్చెందుకు రెడీ అవుతున్న రష్మిక.. కుబేర లో ధనుష్ తో రొమాన్స్ చేస్తుంది. అలాగే సల్మాన్ ఖాన్ సికిందర్ లోను రష్మిక హీరోయిన్. అవే కాదు మరో రెండు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో రష్మిక బిజీ బిజీ.