చంద్రబాబు దళితులకు గౌరవం ఇవ్వడు, వాళ్ళని అవమానిస్తాడు అంటూ నోరేసుకుని పడిపోయే పేర్ని నాని, చంద్రబాబు అహంకారి, ఇంట్లో వాళ్ళకి కూడా చంద్రబాబు గౌరవం ఇవ్వడు అంటూ పిచ్చగా వాగే కొడాలి నాని, రోజా లాంటి వాళ్లకు జగన్ దగ్గర గౌరవం దక్కుతుందట. ఆయన మాకు దేవుడు అంటూ జగన్ మోహన్ రెడ్డికి భజన చేసి మంత్రి పదవులు అనుభవించిన వాళ్లే ఇప్పుడు జగన్ ముందు కనీసం కూర్చోవడానికి కుర్చీ లేకపోవడమే కాదు, జగన్ ముందు చేతులు కట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
2024 ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన వైసీపీ అండ్ కో నిన్నగురువారం జగన్ అధ్యక్షతన జరిగిన మీటింగ్ కి హాజరయ్యారు. జగన్ తో పాటుగా గెలిచిన 10 మంది ఎమ్యెల్యేలు, ఓడిపోయిన నాని, రజిని, పేర్ని నాని, కేశినేని నాని లాంటి వాళ్లంతా ఓటమికి గల కారణాలు చర్చించేందుకు జగన్ మీటింగ్ కి వచ్చారు. ఆ మీటింగ్ లో జగన్ రాజు లాగా కూర్చున్నాడు.
ఆయనతో పాటు మరో నాలుగురు కూర్చున్నప్పటికీ కొడాలి నాని, పేర్ని నాని, రజిని వీళ్లంతా నించుని జగన్ చెప్పేది వింటున్నారు. అంతేకాదు జగన్ ముందు చేతులు కట్టుకుని కట్టుబానిసల్లా కనిపించడంతో నెటిజెన్స్.. నిన్నటివరకు చంద్రబాబు ని అహంకారి అంటూ నానా రకాలుగా వాగిన వారంతా ఇపుడు జగన్ కి బానిసలుగా ఉన్నారు. ఇది మీకు అవమానంగా అనిపించడం లేదా అని కామెంట్ చేస్తున్నారు.