ఒకప్పుడు లక్కీ హీరోయిన్ గా యంగ్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన కృతి శెట్టి హ్యాట్రిక్ మూవీస్ అలాగే హ్యాట్రిక్ నిరాశలతో కోలీవుడ్ కి వెళ్ళిపోయింది. కృతి శెట్టి.. చాలా రోజుల తర్వాత టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఏ యంగ్ హీరో కూడా కృతి శెట్టిని పట్టించుకోకపోయినా.. శర్వానంద్ మాత్రం పిలిచి మనమే మూవీ లో ఛాన్స్ ఇచ్చాడు.
గ్లామర్ షో తో సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది. మనమే ప్రమోషన్స్ లోను, అలాగే మనమే చిత్రంలోనూ గ్లామర్ గా కనిపిస్తూ తాను ఇకపై అందాలు ఆరబొయ్యడానికి రెడీ అని చెప్పకనే చెబుతుంది. మనమే చిత్ర ప్రమోషన్స్ లో అందరి అటెన్షన్ తనవైపు ఉండేలా చూసుకోవడంలో కృతి శెట్టి అడుగడుగునా సక్సెస్ అయ్యింది.
తొలి సినిమాతోనే 100 కోట్లను కొల్లగొట్టిన రికార్డు ఈ హీరోయిన్ సొంతం. మరి ఇప్పుడు మనమే తో ఎలాంటి హిట్ అందుకోబోతుంది. కృతి శెట్టి ఫేట్ ఎలా ఉండబోతుంది అనే రేపు ఈపాటికి తేలిపోతుంది. అంటే అమ్మడు అదృష్టం ఈరోజు రాత్రితో తేలుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ సినిమా, కృతి శెట్టి కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందనేది చూడాలి.