బాలీవుడ్ హీరోయిన్ గా సెలబ్రిటీస్ పై సంచలన కామెంట్స్ చేస్తూ ఎప్పటికప్పుడు న్యూస్ లో నిలిచే కంగనా రనౌత్ బిజెపి పార్టీకి బాగా దగ్గరగా ఉంటుంది. అదే అభిమానంతో ఈ 2024 ఎన్నికల్లో కంగనా ఎంపీగా బీజేపీ తరపున పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచింది. దానితో ఆమె శుక్రవారం ఢిల్లీ లో జరగనున్న ఎంపీల సమావేశంలో పాల్గొనడానికి వెళుతుండగా చండీగఢ్ ఎయిర్పోర్టులో ఫ్లైట్ ఎక్కే సమయంలో విధుల్లో ఉన్న సిఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ తనని చెంప దెబ్బ కొట్టింది అంటూ కంగనా రనౌత్ ఆరోపించడం తీవ్ర సంచలనంగా మారింది.
అసలు ఎంపీ స్థానంలో ఉన్న కంగానని సిఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ చెంప దెబ్బ కొట్టాల్సిన కారణమేమిటంటే.. ఢిల్లీ వెళ్లేందుకు బయలుదేరిన కంగనా రనౌత్ బోర్డింగ్ పాయింట్ కు వెళ్తున్న సమయంలో రైతుల నిరసనలపై చేసిన వ్యాఖ్యలతో, రైతులను ఉగ్రవాదులతో పోల్చడంతో ఆగ్రహానికి గురైన సిఐఎస్ఎఫ్ కుల్వీందర్ కౌర్ కంగనా రనౌత్ చెంప దెబ్బకొట్టినట్లుగా తెలుస్తోంది.
దానితో షాక్ అయిన కంగనా రనౌత్ మహిళా కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ ప్రవర్తనపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ అక్కడే ఉన్న CISF అధికారుల నుండి వివరణ కోరేందుకు ప్రయత్నం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.