Advertisementt

వారసుడు అకీరా తో మోడీని కలిసిన పవన్

Thu 06th Jun 2024 04:31 PM
pawan kalyan  వారసుడు అకీరా తో మోడీని కలిసిన పవన్
Pawan Kalyan and Akira Nandan with Narendra Modi వారసుడు అకీరా తో మోడీని కలిసిన పవన్
Advertisement
Ads by CJ

సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ మాములిది కాదు. అందుకే ఆయన వారసుడు అకీరా పై పవన్ కళ్యాణ్ ఫాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. అకీరా ఒక్కసారి కనిపిస్తే చాలు పొంగిపోతారు. వారసుడు సినిమాల్లోకి వచ్చే సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడు సినిమాల విషయంలో కానీ, సినిమా ఈవెంట్స్ లోకి కానీ తన కొడుకుని పబ్లిక్ గా బయటికి తీసుకురాలేదు. 

అటు రాజకీయంగానూ పవన్ కళ్యాణ్ ఒక్కడే పోరాడుతున్నాడు. మెగా ఫ్యామిలీ అంతా సపోర్ట్ ఉంది. రామ్ చరణ్ పిఠాపురం కూడా వెళ్లాడు. ఎన్నికల ముందు పవన్ వారసుడు అకీరా ఎక్కడా హైలెట్ అవ్వలేదు. కానీ ఎన్నికల ఫలితాల రోజు పవన్ గెలుపు తర్వాత అకీరా బయట అడుగుపెట్టాడు. అంటే అప్పటి నుంచి తండ్రి తోనే కనిపిస్తున్నాడు. జనసేన పార్టీ ఆఫీసులోకి చంద్రబాబు రాక, ఆయన కాళ్ళకి అకీరా తో దణ్ణం పెట్టించి ఆశీర్వాదం ఇప్పించడం, ఆ తర్వాత కొడుకు అకీరాతో కలిసి ఢిల్లీ కి వెళ్లారు పవన్ కళ్యాణ్. 

నిన్న NDA మీటింగ్ తర్వాత ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మోడీని కలిశారు. కొడుకు అకీరా, భార్య అన్న లెజెనోవా తో కలిసి మోదీని మీటయ్యారు. ప్రస్తుతం పవన్, అకీరా అన్నతో కలిసి మోడీని కలిసిన ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.. అది చూసి వారసుడిని సినిమాల విషయంలో కన్నా రాజకీయాల విషయం లో పవన్ హైలెట్ చేస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. 

Pawan Kalyan and Akira Nandan with Narendra Modi:

Pawan Kalyan Family Graces Modi Meet

Tags:   PAWAN KALYAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ