Advertisementt

కల్కి స్పెషల్ షోస్ పై క్రేజీ న్యూస్

Thu 06th Jun 2024 02:38 PM
kalki  కల్కి స్పెషల్ షోస్ పై క్రేజీ న్యూస్
Crazy News on Kalki Special Shows కల్కి స్పెషల్ షోస్ పై క్రేజీ న్యూస్
Advertisement
Ads by CJ

సినిమా ఇండస్ట్రీకి గత ప్రభుత్వం ఆల్మోస్ట్ చుక్కలు చూపెట్టింది అక్కడ థియేటర్స్ లో టికెట్ రేట్స్ పెంచుకోవడానికి కానీ, లేదంటే స్టార్ హీరోల సినిమాలకి బెన్ఫిట్ షోస్ వెయ్యడం కానీ చెయ్యనివ్వలేదు. ఆఖరికి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ విషయంలో వైసీపీ ప్రభుత్వం చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. సినిమా ఇండస్ట్రీకి అనుకూలమైన ప్రభుత్వం టీడీపీ వచ్చింది అని చాలామంది ప్రముఖులు భావిస్తున్నారు. 

అందులో ఆశ్విని దత్ లాంటి వాళ్ళు ఈసారి టీడీపీ భారీ మెజారిటీతో గెలుస్తుంది అని చెప్పినట్టుగానే టీడీపీ అద్భుతమైన విక్టరీ సాధించింది. వారు సినిమా ఇండస్ట్రీ టైమ్ స్టార్ట్ అయినట్లుగా భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఏపీలో బెన్ ఫిట్ షోస్ పై మాటలు వినిపిస్తున్నాయి. అందులో ముందుగా విడుదలవుతున్న భారీ సినిమా కల్కి బెన్ఫిట్ షోస్ ఉండబోతున్నాయట. 

అవి ఏపీలో కూడా ఉండే ఛాన్స్ కాదు.. అప్పుడే కల్కి బెన్ఫిట్ షోస్ కి ఏర్పాటు జరుగుతున్నాయనే న్యూస్ ప్రభాస్ ఫ్యాన్స్ ని నిలవనియ్యడం లేదు. కల్కి 2898 AD కి ఆంధ్రలో బెన్ఫిట్ షోస్ కి ఏర్పాటు చేస్తున్నారట మేకర్స్. జూన్ 10 న రాబోయే ట్రైలర్, 27 న రాబోయే కల్కి విడుదలపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి అప్ డేట్స్ మరింత క్రేజ్ ని పెంచుతాయనడంలో ఎలాంటి సందేహము లేదు. 

Crazy News on Kalki Special Shows:

Kalki Special Shows update 

Tags:   KALKI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ