జగన్ ప్రభుత్వంలో కనీస గౌరవం దక్కక, అప్పుడు సీఎం ని ఎదురించే ధైర్యం లేక, సీఎం జగన్ ని కలవకుండా ఎవరెవరు అడ్డుకున్నారు, జగన్ అప్పాయింట్మెంట్ ఇవ్వకుండా వెయిట్ చేయించిన అధికారులు, మంత్రుల వలన ఇబ్బంది పడిన జగన్ అభిమానులంతా ఓటమి తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరిగా బయటికొస్తున్నారు.
అసలు జగన్ కి ప్రజలకి కోట కట్టిన నాయకులూ, అధికారులు వీరే అంటూ బహిరంగంగానే బయటపెడుతున్నారు. కొంతమంది వైసీపీ నేతలు జగన్ ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ వలనే వైసీపీ ఓడిపోయింది అంటున్నారు. వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి సేవ చేసింది బావుంది. కానీ వాళ్ళ వల్లే వైసీపీ గెలుస్తుంది అని జగన్ నమ్మకం పెట్టుకుని ఏ నాయకుడిని దగ్గరకి రానివ్వలేదు,
ప్రజల వద్దకి నాయకులని వెళ్లనివ్వలేదు. వైసీపీ ఓడిపోవడానికి ముఖ్య కారణం వాలంటీర్ వ్యవస్థ, అలాగే జగన్ ని కలవకుండా కోటకట్టిన అధికారులు, నేతలు అంటూ మాట్లాడుతున్నారు. వైసీపీ లో ఓడిపోయిన చాలామంది జగన్ వలనే ఓడిపోయామంటూ మాట్లాడం చూస్తే విచిత్రంగా ఉంటుంది.
జగన్ కార్యకర్తలకు గౌరవం ఇవ్వలేదు.. అదే కొంప ముంచింది అంటూ గుడివాడ అమర్నాథ్ అంటున్నాడు.
చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా ప్రజలు మమల్ని ఏమర్చారు అంటూ వైజాగ్ నార్త్ వైసీపీ అభ్యర్థి కే కే రాజు వాపోతున్నాడు.
ఎలక్షన్స్ తరువాత కూడా జగన్ I-PAC ఆఫీసు కి వెళ్లి ప్రపంచమంతా మన వైపు చుడబోతుంది అన్నారంటే.. ఎంత భ్రమలో ఉన్నారు.. ఎంత భ్రమలో ఆయన్ని ఉంచారో! ఎమ్మెల్యేలకు కూడా దొరకని సీఎం.. ముఖ్యమంత్రి దగ్గరకు ఏమన్నా సమస్య తో వెళ్తే.. పొద్దున్నుంచి సాయంత్రం దాకా కూర్చోవడం కాదు నుంచోబెట్టే వాడు అంటూ సంచలనంగా వైసీపీ నేత జక్కంపూడి రాజా ప్రెస్ మీట్ పెట్టాడు.