Advertisementt

అల్లు ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న పుష్ప షూటింగ్

Thu 06th Jun 2024 12:33 PM
pushpa the rule  అల్లు ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న పుష్ప షూటింగ్
Allu fans are tensed by Pushpa shooting అల్లు ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న పుష్ప షూటింగ్
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ అభిమానులు చాలా టెన్షన్ పడుతున్నారు. కారణం పుష్ప షూటింగ్ ఇంకా రెండు నెలలు బ్యాలెన్స్ ఉండడమే. ఆగస్టు 15 పుష్ప ద రూల్ విడుదల అంటూ మేకర్స్ ప్రతి పోస్టర్, ప్రతి అప్ డేట్ లో ప్రకటిస్తూ వస్తున్నారు. ఇటు చూస్తే షూటింగ్ ఇంకా కొలిక్కి రాలేదు. ఫాహద్ ఫాసిల్ వలన నిన్నమొన్నటి వరకు షూటింగ్ లో ఇబ్బందులు. 

ఫాహద్ ఫాసిల్ ఇప్పుడు పుష్ప 2 కి డేట్స్ కేటాయించడంతో సుకుమార్ అలెర్ట్ అయ్యారు. ఇప్పటి నుంచి రెండు నెలల వరకు పుష్ప 2 షూటింగ్ అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టాలని డిసైడ్ అయ్యారట. ఇక ఫాహద్ ఫాసిల్ తో కలిసి కనిపించే నటుల డేట్స్ ని సుకుమార్ జాగ్రత్తగా డీల్ చేస్తున్నారట. 

ఎటువంటి పరిస్తితుల్లో ఈ రెండు నెలలో మొత్తం షూటింగ్ పూర్తి కావాలని, అనుకున్న సమయానికే పుష్ప 2 ని విడుదల చెయ్యాలని మేకర్స్ గట్టిగా అనుకుంటున్నారట. ఇక రెండు నెలల వర్క్ అనే విషయం విన్నాక అల్లు అభిమానుల గుండెల్లో గుబులు మొదలైంది. అంతా మంచి జరిగి పుష్ప ఆగష్టు 15 కి రావాలని వారు బలంగా కోరుకుంటున్నారు. 

 

Allu fans are tensed by Pushpa shooting:

Pushpa The Rule shooting update 

Tags:   PUSHPA THE RULE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ