నందమూరి ఫ్యామిలిలో లుకలుకలు అనేవి ఎప్పటికప్పుడు మీడియాలో హైలెట్ అవుతూనే ఉన్నాయి. బాలకృష్ణ తన అన్న హరికృష్ణ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ ని అంతగా పట్టించుకోరనే వార్త పలు సందర్భాల్లో నిజమైంది. అయితే ఎన్టీఆర్ కూడా నందమూరి, నారా ఫ్యామిలీస్ కి దూరంగానే ఉంటారు. గతంలో ఉత్సాహంగా టీడీపీ పార్టీకి ప్రచారం చేసిన ఎన్టీఆర్ గత 10 ఏళ్లుగా మళ్ళి టీడీపీ లో కనిపించిన పాపాన పోలేదు.
అందులో ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ కొడాలి నాని, వల్లభనేని వంశీలు వైసీపీ లోకి చేరి చంద్రబాబు, బాలయ్య, లోకేష్ లని నానా మాటలనడం దానిని ఎన్టీఆర్ ఖండించకపోవడం అన్నీ ఎన్టీఆర్ కి టీడీపీ ని, నారా, నందమూరి ఫ్యామిలీస్ ని దూరం చేశాయనే భావన చాలామందిలో ఉంది. ఇక చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ స్పందించకపోవడం పై రకరకాల రియాక్షన్స్ కనిపించాయి.
భువనేశ్వరిని కొడాలి నాని, వంశీ ఇష్టం వచ్ఛినట్టుగా మాట్లాడిన సందర్భంలో ఎన్టీఆర్ ఇండైరెక్ట్ గా స్పందించడం పై కూడా అనేక విమర్శలొచ్చాయి. అయితే జూన్ 4 ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చెయ్యడంతో సినిమా ఇండస్ట్రీ మొత్తం కూటమిని అభినందిస్తూ చంద్రబాబు, లోకేష్, పవన్, బాలయ్యల కోసం ట్వీట్లు వేశారు.
ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ ఒకే సమయంలో టీడీపీ విక్టరీ సాధించినందుకు గాను చంద్రబాబు ని మావయ్య, బాలయ్యని బాబాయ్, లోకేష్, భరత్, పురందరేశ్వరి అత్తా, పవన్ కళ్యాణ్ పేర్లని సంభోదిస్తూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ శుభాకాంక్షలు తెలిపారు. ఇలా చేసినందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందపడినా.. టీడీపీ హార్డ్ కొర్ ఫ్యాన్స్ నిన్న రిజల్ట్ వస్తే ఇంత లేటుగానా స్పందించేది అంటూ ట్రోల్ చేసారు.
ఇక టీడీపీ, ఎన్టీఆర్ కి వ్యతిరేఖంగా వైసీపీకి అనుకూలంగా ఉండే బ్లూ మీడియా మాత్రం చంద్రబాబు గెలవగానే వరసలు కలిపిన ఎన్టీఆర్ అంటూ ఇష్టం వచ్చినట్టుగా రాసారు. మరికొంతమంది అన్నదమ్ములు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అనుకుని ఒకే సమయంలో పోస్ట్ పెట్టారంటూ వెటకారం చేసారు.