Advertisementt

పవన్ గెలిచినా ఆనందం లేకుండా పోయింది

Thu 06th Jun 2024 10:48 AM
pawan kalyan  పవన్ గెలిచినా ఆనందం లేకుండా పోయింది
Even if Pawan won, there was no joy పవన్ గెలిచినా ఆనందం లేకుండా పోయింది
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి అదిరిపోయే మెజారిటీతో గెలిచారు. అంతేకాకుండా ఆయన నిలబెట్టిన 20 మంది జనసేన కేండిడేట్స్ అందరూ గెలుపు సాధించడంతో పవన్ కళ్యాణ్ తన బాధ్యత మరింత ఎక్కువైంది అంటూ మీడియా ముందు, జనసేన నేతల ముందు మాట్లాడుతున్నారు. మరి పవన్ గెలిచినందుకు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అయితే పవన్ గెలుపు చూసి ఆనందపడిన వారే ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. కారణం ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో బాగా బిజీగా వున్నారు. మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం, చంద్రబాబు సీఎం గా ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత పవన్ తో కలిసి మంత్రులని ఎంపిక చెయ్యడం వీటి కోసం చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది.

అంటే పవన్ కళ్యాణ్ ఫ్రీ అయ్యి ఆయన పూర్తి చెయ్యాల్సిన సినిమాల షూటింగ్స్ ఎపుడు మొదలు పెట్టాలో అర్ధం కాక నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు. హరీష్ శంకర్ తెలివిగా రవితేజ తో సినిమా పూర్తి చేసేస్తున్నారు. అటు క్రిష్ వీరమల్లు నుంచి తప్పుకున్నాడు, ఇటు సుజిత్ పవన్ కోసం వెయిటింగ్.

ఇక నిర్మాతలు బడ్జెట్ కోసం అప్పులు చేస్తారు, పవన్ వచ్చి త్వరగా షూటింగ్స్ చక్కబెట్టేస్తే.. వాళ్ళు ఒడ్డున పడిపోతారు. లేటయ్యే కొద్దీ వాళ్ళకి వడ్డీలు ఎక్కువైపోతాయి. అందుకే పవన్ గెలుపు చూసి ఆనందించేలోపే.. వారిలో టెన్షన్ మొదలవుతుంది. 

Even if Pawan won, there was no joy:

Even if Pawan Kalyan won, there was no joy

Tags:   PAWAN KALYAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ