జూన్ 4 న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎలక్షన్ రిజల్ట్ వచ్చేసింది. ఏపీలో కనీ వినీ ఎరుగని రీతిలో కూటమి గెలిచి విజయకేతనం ఎగురవేసింది, తెలంగాణాలో BRS అధః పాతాళానికి వెళ్ళిపోయింది. ఇక ఎన్నికలు ముగిసాయి, ఫలితాలు వచ్చేసాయి ఇక మొదలెడదామా ఫైట్ అంటూ దర్శనిర్మాతలు రెడీ అయ్యారు.
మరి ఆడియన్స్ మొదలెడదామంటారా.. లేదంటే ఇంకా రాజకీయ విజయోత్సవాలలోనే ఉండిపోతారా అనేది ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. కారణం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలంతా రిలాక్స్ అయ్యారు. ఆడియన్స్ సినిమాల కోసం రెడీ అయ్యారు. గత వారం రాంగ్ టైమ్ లో విశ్వక్ సేన్, కార్తికేయ, గం గం గణేశా తో ఆనంద్ దేవరకొండ వచ్చారు. అప్పుడు ఆడియన్స్ కి మాత్రం సినిమాలు చూసే మూడ్ లేకపోయినా.. ఈ కుర్ర హీరోలు అటు ఇటుగా కలెక్షన్స్ అయితే రాబట్టారు.
ఇక ఈ వారం పొలోమంటూ పలు సినిమాలు థియేటర్స్ కి క్యూ కట్టాయి. అందులో శర్వానంద్ మనమే, కాజల్ సత్యభామ ఇంట్రెస్టింగ్ సినిమాలుగా కనిపించగా.. నమో, లవ్ మౌళి, OC, రక్షణ చిత్రాలు బాక్సాఫీసు వద్ద పోటీపడుతున్నాయి. మరి సత్యభామ, మనమే చిత్రాలు తప్ప ప్రేక్షకులు మిగతా సినిమాలు వైపు చూసినా కూడకపోయినా.. థియేటర్స్ లో మాత్రం సందడి కనిపిస్తుంది.