అవును నిన్నటి నుంచి సోషల్ మీడియాలో అదే కనిపిస్తుంది.. వెల్ కమ్ టు జబర్దస్ రోజా అని. గత ఐదేళ్లుగా వైసీపీ ఎమ్యెల్యేగా గెలిచి జబర్దస్త్ కామెడీ షోకి జెడ్జ్ గా కొనసాగిన రోజా కి రెండేళ్ల క్రితం దక్కిన మంత్రి పదవితో జబర్దస్త్ ని వదిలేసింది. మంత్రి పదవిని అనుభవిస్తూ ప్రజలకి సేవ చెయ్యాలంటూ జబర్దస్త్ నుంచి వీడ్కోలు తీసుకుంది.
కట్ చేస్తే ఈ ఎన్నికల్లో రోజా దారుణమైన పరాజయం చవి చూసింది. ఎగిరెగిరి పడిన రోజా ఇప్పుడు నేలమట్టమైంది. జబర్దస్త్ కమెడియన్స్ నే కాదు.. పవన్ కళ్యాణ్ ని గాడిదకొచ్చినట్టుగా 50 ఏళ్ళు వచ్చాయంటూ వెటకారంగా సంభోదించడం, జగన్ చిటికెన వేలు మీద వెంట్రుక కూడా పీకలేరంటూ మట్లాడడం, అలాగే వైసీపీ వాళ్లే రోజాకి వ్యతిరేఖంగా నగరిలో పని చెయ్యడంతో రోజా ఓడిపోవాల్సి వచ్చింది.
డైమండ్ రాణి రోజా మంత్రి పదవి పోయింది, అసంబ్లీకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే కూర్చోబెట్టారు.. ఇకపై ఖాళీ.. మరి జబర్దస్త్ లోకి జెడ్జ్ గా రావడానికి ట్రై చేస్తావా.. నీ కోసమేనేమో ఇంద్రజ మేడం కూడా జబర్దస్త్ నుంచి తప్పుకుంది.. మరి నువ్ వచ్చేయ్ అంటూ నెటిజెన్స్, రోజా యాంటీ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.