Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bunny vs Charan: Shouldn't have been popular!!

బన్నీ vs చరణ్: జనాకర్షణ కాదు ఉండాల్సింది!!

2024 ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ అంతా జనసేన పవన్ కళ్యాణ్ వెనుకే నిలిచింది. ఇంక్లూడింగ్ అల్లు అర్జున్ కూడా. అల్లు అర్జున్, మెగాస్టార్ కేవలం ట్వీట్స్ తోనే పవన్ కి మద్దతు తెలుపగా రామ్ చరణ్ అయితే ఎన్నికల ప్రచారం చివరి రోజు పిఠాపురం వెళ్లి బాబాయ్ ని కలిసొచ్చాడు. అదే రోజు అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి ట్విస్ట్ ఇచ్చాడు.

అంటే మావయ్య పవన్ కోసం కాకుండా ఫ్రెండ్ కోసం అందులోను వైసీపీ అభ్యర్థి ని సపోర్ట్ చెయ్యడానికి నంద్యాల వెళ్లడం షాకిచ్చింది. అల్లు అర్జున్ వస్తున్నాడని తెలిసి నంద్యాల చుట్టు పక్కల అల్లు అర్జున్ అభిమానులు పెద్ద ఎత్తున పోగయ్యారు. అల్లు అభిమానులతో నంద్యాల జనసంద్రంలా మారింది. అదే సమయంలో రామ్ చరణ్ సైలెంట్ గా పవన్ ఇంటికి పిఠాపురం వెళ్ళాడు.

రామ్ చరణ్ కోసం మెగా అభిమానుకు బారులు తీరినా అల్లు అర్జున్ అభిమానం ముందు కాస్త తగ్గింది అనే చెప్పాలి. మరి ఇప్పుడు ఎన్నికల ఫలితాల్లో అల్లు అభిమానం ముందు మెగా అభిమానమే గెలిచింది. అభిమానం కాదు ప్రేమ ఉండాలి అని పవన్ కల్యాణ్ జనసైనికులు నిరూపించారు. అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన ఆయన ఫ్రెండ్ ఓడిపోయాడు.

దానితో అల్లు అర్జున్ ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మన అనుకున్నవారిని మానేసి ఫ్రెండ్ కోసం పరువు పోగొట్టుకున్నావా అంటూ కామెడీగా కామెంట్ చేస్తున్నారు. 

Allu Arjun vs Ram Charan

Bunny vs Charan: Shouldn't have been popular!!
ram charan