పవన్ కళ్యాణ్ జనసేన లో చేరుదామని వెయిట్ చేసి వెయిట్ చేసి పవన్ తన ఇంటికి వచ్చి మాట్లాడని కారణంగా కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీ లో చేరారు. సరే వైసీపీ నుంచి పోటీ చేసి తన తిప్పలేవో తాను పడకుండా పవన్ కళ్యాణ్ పై నోటికొచ్చిన కారు కూతలు కూస్తూ పవన్ కళ్యాణ్ గనక ఈ ఎన్నికలో గెలిస్తే నా పేరు మార్చికుంటా, ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానంటూ ఛాలెంజ్ చేసారు.
అప్పటినుంచే జనసైనికులు, పవన్ ఫ్యాన్స్ ముద్రగడని ఓ అట ఆడుకుంటూ తెగ ఏడిపించేస్తున్నారు. నిన్న జూన్ 4 న భారీ మేజారిటీతో తాను గెలవడమే కాదు జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి పవన్ కళ్యాణ్ తన స్టామినాని చూపించారు. అంతే ముద్రగడ నీ పేరు మార్చుకునేదెప్పుడు, ముద్రగడ నామకరణోత్సవ ఆహ్వానం అంటూ కార్డు లు ప్రింట్ చేసి వదులుతున్నారు పవన్ ఫాన్స్.
ఈరోజు బుధవారం ఉదయానికల్లా ముద్రగడ ప్రెస్ మీట్ పెట్టి తాను పేరు మార్చుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాను అని, పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటానాని చెప్పాను, మాటకి కట్టుబడి ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాను అని చెప్పారు.
అయితే చాలామంది తనని ఉప్మా పద్మనాభమంటూ అవమానిస్తున్నారు, అలా ఉప్మా పద్మనాభం అంటే ఊరుకోను, మా తాతలు, తండ్రుల నుంచి వస్తున్న ముద్రగడ పేరుకి ఉప్మా అంటూ హేళన చెయ్యడం కరెక్టు కాదు, అసలు ఊరుకోను అంటూ ముద్రగడ తనని ట్రోల్ చేసేవారికి వార్నింగ్ కూడా ఇచ్చాడు.