గత ఐదేళ్లుగా ఎన్నో కష్టాలను, ఎంతో శ్రమటోడ్చి మళ్లీ టీడీపీ ని అధికారంలోకి తెచ్చిన నారా చంద్రబబు నాయుడు అన్ని విషయాల్లో ఆచితూచి అడుగులు వేశారు. తనని జైల్లో పెట్టినప్పుడు కానివ్వండి, మారేదన్నా విషయంలో కానివ్వండి తొందరపడి నిర్ణయాలు తీసుకోలేదు. అంతెందుకు గత కొన్ని నెలలుగా ప్రజల మధ్యలోనే తిరుగుతూ ఎండనక, వాననక కష్టపడిన చంద్రబాబు ఇప్పుడు ఈ మే 13 నుంచి జూన్ 4 వరకు ఉన్న సైలెన్స్ ని వైసీపీ నేతలు భరించలేకపోయారు.
మే 13 తో ఎన్నికలు ముగియగానే మోడీ నామినేషన్ కార్యక్రమానికి వారణాసి వెళ్లోచ్చిన చంద్రబాబు తర్వాత సతీ సమేతంగా మహారాష్ట్ర లోని షిర్డీ వెళ్లి సాయి బాబాని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆయన తన భార్య తో కలిసి విదేశాలకి వెళ్లిపోయారు. అసలు టీడీపీ గెలుపు పై ఆయన ఎలాంటి ధీమా ప్రదర్శించలేదు. ఎక్కడా హడావిడిగా మాట్లాడిలేదు.
చాలా కామ్ గా 15 డేస్ విదేశాలకి వెళ్లొచ్చిన చంద్రబాబు నాయుడికి మంగళవారం ఎయిర్ పోర్ట్ నుంచే అపూర్వ స్వాగతం, మంగళగిరి పార్టీ ఆఫీసులో సిఎం సీఎం అంటూ నినాదాలు. అయినా చంద్రబాబు నిలకడగానే ఉన్నారు. అసలు బాబు ఏమయ్యారు, ఇన్ని రోజులు ఎక్కడికెళ్లారు అని వైసీపీ నేతలు దిగులుపడని రోజు లేదు. టీడీపీ గెలుపుపై చంద్రబాబు రియాక్షన్ కోసం వెయిట్ చేసారు.
కానీ ఆయన ఎంతో నమ్మకంగా ఉన్నారు, గెలుపా ధీమాని చూపించారు. కానీ ఎవ్వరికి తెలియదు. నిన్న ఎన్నికల ఫలితాల్లో టీడీపీ గెలిచి 135 సీట్లు కైవసం చేసుకునేవరకు అందరూ చంద్రబాబు మౌనం గురించే ఆలోచించారు. కానీ ఒక్కసారి బాబు గెలుపుని చూసాక ఎంత ఓపిక, ఎంత సహనం.. హ్యాట్సాఫ్ బాబు అనకుండా ఉండలేకపోతున్నారు.